No postal ballot facility for voters above 65 పోస్టల్ బ్యాలెట్ పై వెనక్కు తగ్గిన సీఈసీ..

Eci decides not to extend postal ballot facilities to voters above 65 years of age

postal ballot, Election Commission of India, ECI, Election Commission, Bihar elections, Bihar, Bihar Assembly elections, Polling stations, Covid positive voters

The Election Commission of India (ECI) recommended extension of optional postal ballot facilities to voters above 65 years in order to minimize their vulnerability and exposure at the Polling stations and to Covid positive voters and voters under quarantine so that they are not deprived of their voting rights.

పోస్టల్ బ్యాలెట్ పై వెనక్కు తగ్గిన సీఈసీ.. అడ్డంకులే కారణమా.?

Posted: 07/18/2020 02:39 PM IST
Eci decides not to extend postal ballot facilities to voters above 65 years of age

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను ఇప్పటికే చిదిమేస్తోంది. దీనిని నియంత్రించేందుకు వాక్సీన్ తయారీలో ప్రపంచ దేశాలు తలమునకలు అయ్యాయి. ఇక ఈ సమంలోనూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఈ నిర్ణయాలతో మహమ్మారి ప్రబలకుండా చర్యలు తీసుకునే నేపథ్యంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం వయోవృద్దులు, బీపి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు పోస్టల్ బ్యాలెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. ఈ మేరకు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా సేకరించిన అనంతరం నిర్ణయం కూడా తీసుకుని ముందుకు అడుగులు వేసింది.

అయితే తాజాగా పోస్టల్‌ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. వయోవృద్దులకు, బిపి, మధుమేహం, ఇతరాత్ర సుదీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారిని ఓటు హక్కుకు కూడా విలువను ఇచ్చి వారిని కూడా ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పింది. కానీ తాజాగా మాత్రం అందుకు పలు అంశాలు మోకాలడ్డుగా నిలుస్తున్నాయని పేర్కోంది, రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, ఇతర ఏ ఎన్నికల్లో గానీ ప్రస్తుతానికి 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడం లేదని స్పష్టంచేసింది.

దీని అమలు విషయంలో ఎదురవుతున్న కొన్ని అడ్డంకులు, సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. రానున్న బిహార్‌ ఎన్నికలు, మధ్యప్రదేశ్‌లో 24 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలని ఈ నెల మొదట్లో ఈసీ భావించింది. 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉన్న పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన అందరికీ వర్తింపజేయాలని నిర్ణయించింది. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. బిహార్‌ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్‌ 26తో ముగియనున్న నేపథ్యంలో ఆలోపే అక్కడ ఎన్నికలు జరపాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles