140 TTD Staff Test COVID-19 Positive తిరుమలలో కరోనాపై కాక రేపుతున్న రమణ దీక్షితులు వ్యాఖ్యలు

Ramana deekshitulu continues to fire at ttd

Coronavirus in Tirumala, Ramana Deekshitulu, Ramana Deekshitulu on corona, Ramana Deekshitulu on TTD officials, Coronavirus on seven hills Shrine, Coronavirus to TTD priests, coronavirus to TTD Employees, coronavirus TTD staff, TTD meet amid coronavirus, TTD priests, TTD staff, TTD Employees, coronavirus, covid-19, lockdown, chittor collector, Bharat Gupta, Tirumala, Turupati, Andhra pradesh

Former chief priest of Lord Venkateshwara temple on Tirumala A V Ramana Deekshitulu who has started expressing his unhappiness over the state of affairs in the TTD for the last few days, seems to have decided to continue his tirade. He spit fire at the senior officials of the TTD for continuing to allow darshans in the Tirumala temple.

తిరుమలలో 140 అర్చకులకు కరోనా.! కాక రేపుతున్న రమణ దీక్షితులు వ్యాఖ్యలు.!!

Posted: 07/16/2020 07:00 PM IST
Ramana deekshitulu continues to fire at ttd

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. అక్కడి, ఇక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడకు చోచ్చుకెళ్తోంది. లాక్ డౌన్ విధింపుతో సుమారు 80 రోజుల పాటు భక్తుల తాకిడి లేకుండా వెలవెలబోయిన కలియుగ వైకుంఠంలో అన్ లాక్ 1.0 మార్గదర్శకాలతో ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ తరుణంలో పవిత్ర కోండపై కరోనా కలకలం రేగింది. గత నెల నుంచి ప్రారంభమైన శ్రీవెంకటేశ్వరుడి దివ్యదర్శనం నేపథ్యంలో ఏడుకోండలపై కరోనా కలవరం తీవ్ర అందోళనకు గురిచేసింది. గత నెలలో ఆంక్షల నడుమ దర్శనాలను ప్రారంభించిన తరువాత, స్థానిక బాలాజీ నగర్ లోని ఓ వ్యక్తికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. ఏకంగా 140 మంది టీటీడీ సిబ్బంది, అర్చకులకు కరోనా సోకింది, అయితే ఇందుకు టీటీడీ అధికారులను బాధ్యులుగా చేస్తున్నారు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.

ఓ వైపు కరోనా వైరస్ విజృంభన కోనసాగుతున్నా పవిత్రమైన శ్రీవారి కోండపైకి భక్తులను ఎందుకు అనుమతిస్తు్నారని, శ్రీవారి దర్శనం ఎందుకు కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలని, దీనికి తితిదే ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో శ్రీనివాస రాజు అందుకు అడ్డుపడుతున్నారంటూ ఆయన ట్వీట్‌ చేశారు. టీటీడీలో పని చేస్తున్న 50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా సోకిందని, మరో 25 మంది ఫలితాలు రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. వైరస్‌ ఇంకా వ్యాపించే ప్రమాదం ఉన్నప్పటికీ దర్శనాలు నిలిపివేయడం లేదన్న ఆయన ఇలాగే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని రమణదీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు.

రమణ దీక్షితులు వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ సుబ్బారెడ్డి విబేధించారు. ఇప్పట్లో దర్శనాలు నిలిపే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రమణ దీక్షితులు చెప్పాల్సింది ఏమైనా ఉంటే బోర్డుకు చెప్పాలే తప్ప.. ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అన్నమయ్య భవన్ లో ఆర్చకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ ఉద్యోగులకు 40 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. కరోనా బారిన పడిన వారిలో 14 మంది అర్చకులు ఉన్నారని అయన అన్నారు. కాగా ఇప్పటికే కరోనా నేపథ్యంలో టీటీడీ అన్ని చర్యలు చేపడుతోందని అన్నారు. ఇక భక్తుల నుంచి కరోనా వస్తుందన్నట్లుగా రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యల్లోనూ నిజం లేదని అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నామని, జ్వరం లేకుంటేనే కొండపైకి అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

అయితే తిరుపతిలో కోరానా సోకిన వ్యక్తులు కోండపైకి వచ్చిన నేపథ్యంలో ఈ వైరస్ సోకి వుంటుందని అనుమానాలకు కలెక్టర్ ప్రకటనతో చెక్ పడింది. అయితే భక్తులకు ఏ విధమైన కరోనా లక్షణాలున్నా, కొండపైకి రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసిన వైవీ సుబ్బారెడ్డి, తిరుమలలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ప్రక్రియను చేస్తున్నామని, క్యూలైన్లను నిత్యమూ శుభ్రపరుస్తున్నామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు వారం రోజుల పాటు కొండపైనే ఉండే విధంగా షిఫ్ట్ లలో విధులను వేస్తున్నామని గుర్తు చేశారు, గత నెల చివరి వారంలో విధులు నిర్వహించిన వారిలో కొందరికి వైరస్ సోకిందని అన్నారు. ఇక తాజా పరిణామాలపై చర్చించేందుకు టీటీడీ బోర్డు ఎప్పటికప్పుడు సమావేశాలను  ఏర్పాటు చేసి చర్చిస్తూనే వుందని, అన్నారు. తిరుమల కోండపై పవిత్రను కాపాడుతూనే భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles