IIT Delhi's covid-19 test kit at ₹399 అమాంతం తగ్గిన కరోనా టెస్టింగ్ కిట్ ధర..

Coronavirus crisis iit delhi develops low cost testing kit priced rs 650

coronavirus testing kit, IIT Delhi corona testing kit, IIT Delhi coronavirus testing kit, Coronavirus vaccine, Covid vaccine, Latest updates on coronavirus vaccine, Coronavirus vaccine latest news, Covid 19 vaccine news, Corona vaccine news, IIT Delhi, corosure, covid-19, diagnostic kit, National Chemical Laboratory, Newtech Medical Devises, ICMR, Ramesh Pokhriyal, Latest news on corona

The Union government announced the commercial launch of a covid-19 test kit developed by the IIT Delhi at a base price of ₹399, the cheapest in the market, and which may help ramp up coronavirus testing in the country. The commercial product named 'Corosure' was approved by the Indian Medical Council of India and Drug Control General of India

అమాంతం తగ్గిన కరోనా టెస్టింగ్ కిట్ ధర.. ఢిల్లీ ఐఐటీ విద్యార్థుల ప్రతిభ

Posted: 07/16/2020 12:51 PM IST
Coronavirus crisis iit delhi develops low cost testing kit priced rs 650

కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తమ దేశ ప్రజల ప్రాణాలను హరించేస్తుందేమోనన్న భయాందోళనకు గురైన ప్రభుత్వాలు.. టెస్టులను చేపట్టాయి. వందలు దాటి వేలు దాటి లక్షల సంఖ్య దాటి ఏకంగా కోటి మార్కును దాటిన టెస్టుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఖర్చుకు వెనకాడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ క్రమంలో దాదాపు ఐదు వేల నుంచి సగం ధరకు మాత్రమే కోవిడ్-19 టెస్టుల కిట్ ధర చేరుకున్నాక ప్రభుత్వం మార్గదర్శకాలతో ప్రైవేటు ల్యాబ్ లలో టెస్టులకు అనుమతులను జారీ చేసింది. ఇక దేశంలో ఏకంగా పది లక్షల చేరువలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ భారతీయ ఐఐటీ విద్యార్థులు రూపోందించిన కిట్ ఖర్చును అమాతం తగ్గించింది.

కరోనా అంటే ఓ వైపు టెస్టులకు ఏకంగా రెండున్నర వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్న ఆర్థికంగా వెనుకబడిన వారు వ్యాధి సోకినా.. కాషాయాలు, వేడి నీళ్లు తాగి దాని తగ్గించుకుంటున్న క్రమంలో ఇక అలాంటి భయాలకు చెక్ పెట్టేలా కొత్త కరోనా కిట్ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ ఐఐటీ అత్యంత చవకైన కొవిడ్ టెస్టింగ్ కిట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని అసలు ధర రూ. 399 కాగా, ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్, శాంపిల్ కలెక్షన్ వంటి వాటితో కలుపుకుని రూ. 700లోపు లభ్యమవుతుంది. కోరోష్యూర్ పేరుతో ఢిల్లీ ఐఐటీకి చెందిన 9 మంది రీసెర్చ్ విద్యార్థులు దీనిని అభివృద్ధి చేశారు.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, సహాయమంత్రి సంజయ్ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ  కార్యదర్శి అమిత్ ఖరే, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ వి.రామ్‌గోపాలరావు కలిసి దీనిని విడుదల చేశారు. ఈ కిట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం ఉంది. న్యూటెక్ మెడికల్ డివైజెస్ సంస్థతో కలిసి దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ కిట్‌లో వాడిన అన్ని రకాల పరికరాలు దేశీయంగా తయారైనవేనని ఐఐటీ డైరెక్టర్ రామ్‌గోపాలరావు తెలిపారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే పలు పరిశోధనలు చేపట్టామని, అశ్వగంధ ఔషధం వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించినట్టు ఆయన వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles