Janasena on fire mishap at Visakha Solvents plant పరవాడ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం: పవన్

Pawan kalyan on fire mishap at visakha solvents plant in vizag pharma city

Janasena, pawan kalyan, pawan kalyan on parawada pharma city incident, Parawada Pharma City, Parawada Pharma City fire, jn pharma city fire, jn pharma city blast, Parawada Pharma City blast, Visakha Solvents blast, Blast at Visakha Solvents, visakha solvents, vizag fire, pharma city, visakhapatnam, Andhra Pradesh, politics

Janasena chief pawan kalyan express his grief on visakhapatnam parawada fire incident. Power star questions the government in the continous incidents taken place in industrial belt area. janasenani also questions on the safety measures taken by the management of the company at chemical manufacturer Visakha Solvents Ltd's plant in the Pharma City, Parawada, Visakhapatnam.

పరవాడ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం: పవన్ కల్యాణ్

Posted: 07/14/2020 05:16 PM IST
Pawan kalyan on fire mishap at visakha solvents plant in vizag pharma city

విశాఖ జిల్లా పరవాడలోని కంపెనీలో జరిగిన ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వరుస ప్రమాద ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. గాజువాక, పరవాడ కేంద్రాలుగా విస్తరించి ఉన్న పారిశ్రామిక ప్రాంతాలలో వరుసగా ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వరుస ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం వుందన్నారు. ఎల్.జి.పాలిమర్స్, సాయినార్ ఫార్మా ప్రమాదాలు మరవక ముందే రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్ కర్మాగారంలో సోమవారం అర్ధరాత్రి సంభవించిన ప్రమాదం భయబ్రాంతులకు గురి చేసింది అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు? ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారు?’’ వంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయన్నారు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ సాల్వెంట్ పరిశ్రమలో ప్రమాదకరమైన, మండే స్వభావం గల ఆయిల్స్, రసాయనాలు నిల్వ చేస్తున్నప్పుడు రక్షణ ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలన్నారు. రక్షణ ఏర్పాట్లు ఉంటే ఈ పేలుడు ఎందుకు సంభవించిందో ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీ.ఈ.టీ.పీ పరిధిలో ప్రమాదం జరిగిన పరిశ్రమను నిర్వహిస్తున్నారు అని వస్తున్న వార్తలపై ఫార్మాసిటీ నిర్వాహకులు, ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా వివరణ ఇవ్వాలి అన్నారు.

కంపెనీలో సంభవించిన పేలుడు పది కిలోమీటర్ల వరకు వినిపించిందంటే దాని స్థాయి మనం ఊహించవచ్చన్నారు పవన్. మంట్నలి అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడవలసి వచ్చిందంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది.. పేలుడులో ఒకరు మృతి చనిపోయారని.. ఆరుగురు కార్మికులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలిసి చాలా ఆవేదన కలిగిందన్నారు. కంపెనీలో కాలిన తీవ్ర గాయాలతో కనిపించిన మృతదేహం గత అర్ధరాత్రి నుంచి కనిపించకుండాపోయిన సీనియర్ కెమిస్ట్ శ్రీ కె.శ్రీనివాస్ అని తోటి వారు చెబుతున్నారని.. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయిన శ్రీ మల్లేష్ కు మెరుగైన వైద్య సహాయం అందచేయాలన్నారు.

ఈ ప్రమాద ఘటనపై స్థానిక ఇన్స్ ఫెక్టర్ ఆప్ ఫ్యాక్టరీస్ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విశాఖ జనసేన ప్రధాన కార్యదర్శి శివ శంకర్ తో మాట్లాడి.. బాధితులకు అండగా ఉండాలని కోరానన్నారు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే సహాయ కార్యక్రమాలలో పాల్గొనడానికి జనసైనికులు తరలి వెళ్లారన్నారు. మృతుని కుటుంబానికి, గాయపడినవారికి సంతృప్తికరమైన రీతిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి పరిహారం అందే వరకు స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం క్షుణ్ణంగా విచారణ జరిపి.. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles