Mudragada quits Kapu reservation movement ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం షాక్.!

Mudragada padmanabham quits kapu reservation movement

Mudragada Padmanabham quits Kapu movement, mudragada quits kapu reservation movement, kapu leader mudragada, backward class status to kapus, Attack on mudragada on TV channels, anti mudragada posts in Social meida, Mudragada Padmanabham, kapu leader, TV channels, Social meida, Andhra Pradesh, Politics

Kapu leader Mudragada Padmanabham announced his decision to quit the Kapu reservation movement. In a letter written Mr. Padmanabham said; 'Attack on my course of action to achieve the B.C.(Backward Class) Status for Kapu both on social media and TV channels by fellow Kapu people have left me in shock, forcing me to quit the movement'.

ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం.. ఏపీ రాజకీయాల్లో షాక్.!

Posted: 07/13/2020 05:27 PM IST
Mudragada padmanabham quits kapu reservation movement

(Image source from: Telugubulletin.com)

కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన.. ముద్రగడ పద్మనాభం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం కూడా రాజకీయ వర్గాలను కుదిసేసింది. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. కాపులను బిసీలలో చేర్చాలన్న డిమాండ్ తో ఉద్యమాన్ని ప్రారంభించిన ముద్రగడ.. తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో చేరి.. ఉద్యమాన్ని ఉద్దృత స్థాయికి తీసుకెళ్లి రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు కాపుల రిజర్వేషన్లను అజెండా చేసుకునే స్థాయికి తీసుకెళ్లిన తాను.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్తితుల నేపథ్యంలో తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాట్లు తెలిపారు.

Mudragada Padmanabham Letter(Image Source: Teluguin.com)

కాపు ఉద్యమంలో చేరిన తాను అన్ని రకాలుగా నష్టపోయానని అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయానని వివరించారు. కాపు ఫలాల సాధన కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నించడం జరిగిందని చెప్పుకొచ్చారు. తాను మానసికంగా దిగజారే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని, వీటితో కలత చెంది ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఉద్యమకాలంలో తను వసూలు చేసిన నిధులు వారికి పంచలేదనే దాడులు చేయిస్తున్నారని, కాపు జాతికి మంచి జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశానన్నారు. మన పెద్దలు పేరు చెప్పకుండా..పది మందితో తిట్టిస్తున్నారని వెల్లడించారు. తుని సభ, పాదయాత్ర విజయవంతం తన గొప్పతనం కాదని చెప్పిన ఆయన…నన్ను తిట్టించే వారితోనే రిజర్వేషన్లు సాధించాలని కోరుతున్నానని తెలిపారు.

Mudragada Padmanabham Letter(Image Source: Teluguin.com)

ఏపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం..కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గుర్తింపు ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలో పనిచేశారు. 2014 నుంచి ఏ పార్టీలో చేరకుండా ఉన్నారు. 2016 జనవరి, 31న తూర్పుగోదావరి తునిలో కాపు ఐక్య గర్జన సబ ద్వారా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. తునిలోని కొత్తూరు వద్ద జరిగిన ఈ సభ నుంచి ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామని పిలుపునిచ్చారు. రోడ్లు, రైళ్ రోకోలకు పిలుపునివ్వడంతో చాలా మంది హైవేలు, రైల్వే ట్రాక్ లను దిగ్భందించారు. దీని ద్వారా విధ్వంసం చోటు చేసుకుంది. రైళ్లను దగ్ధం చేశారు. కాపు ఉద్యమం కోసం కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంట్లోనే నిరహార దీక్షలకు కూర్చున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles