Covid 19: 1062 fresh cases reported in AP ఏపీలో ఒక్క రోజులో 1062 కేసులు.. 12 మరణాలు

Coronavirus in ap 1062 new covid 19 cases state tally crosses 22 thousand mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 22000 Mark after 1062 new cases were reported in the last 24 hours, out of which 11,101 have so far recovered and have been discharged, while 264 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. 22 వేలు ధాటిన కేసులు..264 మరణాలు

Posted: 07/08/2020 10:33 PM IST
Coronavirus in ap 1062 new covid 19 cases state tally crosses 22 thousand mark

(Image source from: Hindustantimes.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాదిమందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు ఇరవౌ రెండు వేల మార్కుకు అధిగమించాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు వెయి మార్కుకు అటుఇటుగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా ఇరవై రెండు వేల మార్కును అధిగమించి పరుగులు పెడుతోంది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ ఐదు వందలకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా ఇరవై వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 1178 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 22,259 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య రెండుగా నమోదుకాగా, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. మొత్తంగా 11గా నమోదయ్యాయి. రాష్ట్రంలో మాత్రం 1062 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా ఆనంతపురంలో 87, చిత్తూరు జిల్లాలో 255, తూర్పు గోదావరి జిల్లాలో 125, గుంటూరు జిల్లాలో 173, కడప జిల్లాలో 71, కృష్ణా జిల్లాలో 70, కర్నూలు 51. నెల్లూరు జిల్లాలో 63, ప్రకాశం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 31, విశాఖపట్నం జిల్లాల్లో 38, విజయనగరంలో 38, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 12 మంది అసువులు బాసారు. కరోనా వైరస్‌తో కర్నూలులో ముగ్గురు, అనంతపురం ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇ్దదరూ, చిత్తూరు జిల్లాలో. గుంటూరు జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 264 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల నుంచి ఇవాళ 762 మంది కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు. వీరిని గడిచిన 24 గంటల్లో కరోనాబారిన పడి కోలుకున్న పేషంట్లను వైద్యాధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11,101కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 10,894కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 422గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2266కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Revolutionary balladeer vangapandu prasada rao passes away

    జనపద జానపదగళం మూగబోయింది.. వంగపండు ఇకలేరు..

    Aug 04 | ప్రజాగాయకుడు, విప్లవ రచయిత, జానపద కళాకారుడు, ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ఉత్తరాంధ్ర జనం పాట ఊపిరి వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస... Read more

  • Ex cpm mla from telangana sunnam rajaiah dies of covid 19

    మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కాటేసిన కరోనా

    Aug 04 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ప్రజల ప్రానణాలతో చెలగాటం ఆడుతోంది. ఇన్నాళ్లు సామాన్యుల ప్రాణాలను టార్గెట్ చేసుకుని కబళించిన కరోనా.. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇటీవలే... Read more

  • Covid 19 update with 1286 new covid 19 cases telanganas tally surges near 69000 mark

    తెలంగాణలో కరోనా విజృంభన: 24 గంటల్లో 1286 కేసులు.. 12 మరణాలు

    Aug 04 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా అరవై తోమ్మిది వేల మార్కుకు చేరువలో వున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా... Read more

  • Coronavirus cases in india records spike of over 50000 cases tally tops 18 5 lakh

    దేశంలో కరోనా ఉగ్రరూపం: 18 లక్షలు చేరిన కేసులు.. 39 వేలకు చేరిన మరణాలు

    Aug 04 | దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోమారు... Read more

  • Kangana ranaut alleges gunshots fired near her residence in manali

    హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..!

    Aug 02 | బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ గా ఇటీవలే ముద్రపడిన కంగనా రనౌత్ ఇంటివద్ద తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరగ్గా అమె... Read more

Today on Telugu Wishesh