MHA gives nod for Degree, PG Exams డిగ్రీ, పీజీ విద్యార్థుల పరీక్షలకు కేంద్రం అనుమతి

Union home ministry allows colleges to conduct degree pg examinations

Union Home Ministry, Indian colleges, Indian universities, degree and pg exams, coronavirus, degree and pg exams news, degree and pg exams latest, degree and pg exams new updates, degree and pg exams dates, degree and pg exams schedules, degree exams, post Graduate exams, final semister, coronavirus, covid-19

The Union Home Ministry allowed all the colleges and universities across the country to conduct examinations following all the government issued guidelines following social distancing. The Home Ministry said that there is no scraping of the final year or final semester examinations at the colleges and universities.

డిగ్రీ, పీజీ విద్యార్థుల పరీక్షలకు కేంద్రం అనుమతి

Posted: 07/07/2020 07:46 PM IST
Union home ministry allows colleges to conduct degree pg examinations

(Image source from: Financialexpress.com)

కరోనా వైరస్ మహమ్మారి విజృంభనను కట్టడి చేయడానికి ప్రపంచదేశాలు విధించిన లాక్ డౌన్ లు దేశంలోని అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యావ్యవస్థ అస్త్యవ్యస్తమైంది. 4 నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడగా.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏకంగా రద్దయ్యాయి. ఐతే డిగ్రీ, పీజీ పరీక్షలను సైతం రద్దు చేయాలన్న డిమాండ్ అటు విద్యార్థుల నుంచి.. ఇటు వారి తల్లిదండ్రుల నుంచి కూడా వినిపిస్తున్న తరుణంలో తాజాగా ఇవాళ్లి వరకు ఈ పరీక్షలపై సస్పెన్స్ కొనసాగింది. అయితే ఇవాళ కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజా అనుమతుల నేపథ్యంలో సస్పెన్స్ కు తెరపడింది.

అయితే పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు కల్పించినట్లు వీరికి పరీక్షలను రద్దు చేయకుండా.. యూనివర్సిటీలు, ఇతర సంస్థల వినతి మేరకు డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు కేంద్రం హోంశాఖ అనుమలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి హోంశాఖ లేఖ రాసింది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం, యూనివర్సిటీల అకాడమిక్ క్యాలెండర్ మేరకు ఫైనల్ టర్మ్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాలని స్పష్టం చేసింది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన స్లాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది.

కాగా, ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నత విద్య పరీక్షలను రద్దు చేసి.. పై తరగతులకు ప్రమోట్ చేశాయి. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడించాయి. ఐతే గుజరాత్ ప్రభుత్వం ఫైనల్ ఇయర్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. ఆ ప్రకటనపై యూటర్న్ తీసుకుంది. తాజాగా కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయా యూనివర్సిటీలు పరీక్షల నిర్వహణపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశముంది. వీలైనంత త్వరలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఓ వైపు కరోనా తన ఉద్దృతిని పెంచుకుంటున్నతరుణంలో మరోవైపు సరికొత్త రూపంలో ప్లేగు వ్యాధి విస్తరిస్తున్న క్రమంలో విద్యార్థుల ప్రాణాలు అత్యంత అమూల్యమైనవని అన్నారు. అయితే పరీక్షల నిర్వహణ తప్పనిసరి అయిన పక్షంలో దానికి కూడా సరికొత్త మార్గాలను అన్వేషించాలని పలువురు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles