EC extends postal ballot facility to voters above 65 ఈసీ సంస్కరణతో పోస్టల్ బ్యాలెట్ కు బలం..

Ec extends postal ballot facility to voters above 65 covid 19 patients

Bihar Assembly elections, voting, Postal voting, Postal ballot, COVID 19, Coronavirus, Election Commission, Election Amendment

The government has extended the postal ballot facility to electors above 65 years of age and COVID-19 positive patients who are under home or institutional quarantine. The changes have come about months before assembly elections in Bihar, which are likely to take place later this year.

ఎన్నికల కమీషన్ సంస్కరణతో పోస్టల్ బ్యాలెట్ కు బలం..

Posted: 07/03/2020 12:32 AM IST
Ec extends postal ballot facility to voters above 65 covid 19 patients

కరోనా వైరస్ మహమ్మారి విశ్వవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తూ కోటి మందికి పైగా ప్రజలను తన ప్రభావానికి గురిచేసి.. ఐదు లక్షల మంది ప్రాణాలను కబళించి వేసింది. దీంతో దాదాపుగా అన్ని వ్యవస్థలు, రంగాలలో మార్పులు కూడా సంక్రమించాయి. అయితే మహమ్మారి ప్రభావం చివరికి ప్రజాస్వామ్య వ్యవస్థగా బాసిల్లుతున్న భారత ఎన్నికలపై కూడా పడింది. కరోనా ప్రభావం నేపథ్యంలో రాష్ట్రల్లో ఎన్నికల నిర్వహణ విషయంలోనూ మార్పులు తీసుకువచ్చింది భారత ఎన్నికల సంఘం. దీంతో ఇప్పటి వరకు కేవలం ఎన్నికల విధుల్లో పాల్గోనే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు మాత్రమే పరిమితమైన పోస్టల్ బ్యాలెట్ కు కూడా మంచి బలం వచ్చింది.

అదెలా అంటే తాజాగా కేంద్ర ఎన్నికల కమీషన్ కరోనా నేపథ్యంలో తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా ఇకపై 65 ఏళ్ల పైబడిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చింది. వీరితో పాటు మధుమేహం, రక్తపోటు ఉన్న వారు, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వున్నవారికి.. వీటితో పాటు అరోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నవారికి కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉండటంతో వారికి పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయడం నుంచి మినహాయింపు కల్పించడంతో పాటు వారి ఓటుహక్కును మాత్రం పధిలం చేయాలన్న సంకల్పించడంతో సీఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్ లో బిహార్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. వైరస్‌ విజృంభణ దృష్ట్యా ఏదేమైనప్పటికీ వృద్ధులు బయటకొచ్చేందుకు అనుమతి ఇవ్వకూడదని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వారే కాకుండా మధుమేహ రోగులు, రక్తపోటుతో బాధపడుతున్న వారు, గర్భిణులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలాంటి వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉపయుక్తంగా ఉండనుంది. గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం 80 ఏళ్లకు పైబడినవారికి, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఉండేది. ఇప్పుడు 80 నుంచి 65 ఏళ్లకు కుదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar elections  voting  Postal voting  Postal ballot  COVID 19  Coronavirus  Election Commission  

Other Articles