Why Can't Courts Take Over Government: AP Speaker న్యాయస్థానాలపై ఏపీ శాసనసభాపతి సంచలన వ్యాఖ్యలు

Ap speaker alleges courts giving directions in policy matters

AP Speaker, AP Assembly Speaker, Speaker, Tammineni Sitaram sensational comments on courts, AP speaker on courts, Ap speaker senstional comments, AP Assembly, Assembly Speaker, Tammineni Sitaram, YS Jagan Mohan Reddy, courts, government, policy matters, Andhra Pradesh, politics

Andhra Pradesh Assembly Speaker Tammineni Sitaram alleged courts were giving directions to the government in policy matters. The outburst, in Tirupati, came in the backdrop of the YS Jagan Mohan Reddy government suffering setbacks with the Andhra Pradesh High Court annulling several of its decisions in recent verdicts.

న్యాయస్థానాలపై ఏపీ శాసనసభాపతి సంచలన వ్యాఖ్యలు

Posted: 07/02/2020 10:51 PM IST
Ap speaker alleges courts giving directions in policy matters

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో న్యాయస్థానాల ప్రమేయం అధికంగా వుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలకు రాజ్యాంగపరమైన వ్యవహారాల్లో జోక్యానికి కొన్న పరిమితులు వున్నాయని, వాటిని కూడా తోసిరాజుతూ ప్రభుత్వాలను ఏ కార్యకలాపాలు చేయనీయకుండా చేతులు కట్టేసేలా వ్యవహరిస్తున్నాయని అన్నారు. హైకోర్టు తీర్పుల తీరును స్పీకర్ తమ్మినేని తప్పుబట్టారు. రాష్ట్రంలో ద్రవ్య బిల్లును ఆమోదం పొందడానికి ఆపి.. ఉద్యోగుల జీతాలను అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రేక్ సమయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, బోర్డు సభ్యులు ఆహ్వానం పలికి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం న్యాయస్థానాలు వెలువరిస్తున్న పలు తీర్పులు చూస్తూన్నామని. రాజ్యాంగం కొన్ని హక్కులు, అధికారాలు, బాధ్యతలను ఇస్తూ హద్దులను కూడా నిర్ణయించి.. ఒకరి దాంట్లో మరొకరు జోక్యం చేసుకూకూడదని చెప్పినా.. న్యాయస్థానాలే ప్రస్తుతం ఆ హద్దులను దాటేసి మరీ జోక్యం చేసుకుంటున్నాయని అవేదన వ్యక్తం చేశారు.

తన ఆక్రోశాన్ని వెల్లగక్కుతూ.. ‘‘కోర్టుల నుంచే ఆదేశాలొస్తోన్నాయి. ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు ఇలా చేయండి.. అలా వద్దు అంటున్నప్పుడు ప్రజలు ఎందుకు? ఎన్నికలెందుకు? ఓట్లు ఎందుకు?ఎమ్మెల్యేలు ఎందుకు? పార్లమెంట్‌ సభ్యులు ఎందుకు? శాసనసభ ఎందుకు? శాసనసభకు నాయకులను ఎన్నుకోవడం ఎందుకు? ముఖ్యమంత్రి  ఎందుకు? స్పీకర్‌ ఎందుకు? ఇవన్నీ దేనికి? నేనుమంటానంటే.. డైరక్టుగా మీరే రూల్‌ చేస్తారా? న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాలను నడిపిస్తారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలో ఏమి చేయకూడదో కూడా వారే చెబుతారా.? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజలకు ప్రజామోద పాలనను అందించేందుకు అవలంభించాల్సిన పద్దతులను, విధివిధానాలను రాజ్యాంగంలో పోందుపర్చారు. వాటిని ఇటు రాజకీయ వేత్తలు, ప్రభుత్వాలు, పాలకులతో పాటు న్యాయస్థానాలు కూడా పాటించాలని.. వాటిని మనపై నమ్మకంతో రాశారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి క్లిష్టపరిస్థితులు బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండి ఉంటే దీనిక్కూడా ఓ ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్లేమోనని అనుకుంటున్నానని అన్నారు. ఇలాంటి తీర్పులు వస్తాయని.. ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకోలేదు. అనుకొని ఉండి ఉంటే దానికి ప్రత్యామ్నాయమైన ఒక వెసులుబాటు ఏర్పాటు చేసేవాళ్లేమో.. అలా జరగలేదని తమ్మినేని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Revolutionary balladeer vangapandu prasada rao passes away

  జనపద జానపదగళం మూగబోయింది.. వంగపండు ఇకలేరు..

  Aug 04 | ప్రజాగాయకుడు, విప్లవ రచయిత, జానపద కళాకారుడు, ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ఉత్తరాంధ్ర జనం పాట ఊపిరి వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస... Read more

 • Ex cpm mla from telangana sunnam rajaiah dies of covid 19

  మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కాటేసిన కరోనా

  Aug 04 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ప్రజల ప్రానణాలతో చెలగాటం ఆడుతోంది. ఇన్నాళ్లు సామాన్యుల ప్రాణాలను టార్గెట్ చేసుకుని కబళించిన కరోనా.. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇటీవలే... Read more

 • Covid 19 update with 1286 new covid 19 cases telanganas tally surges near 69000 mark

  తెలంగాణలో కరోనా విజృంభన: 24 గంటల్లో 1286 కేసులు.. 12 మరణాలు

  Aug 04 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా అరవై తోమ్మిది వేల మార్కుకు చేరువలో వున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా... Read more

 • Coronavirus cases in india records spike of over 50000 cases tally tops 18 5 lakh

  దేశంలో కరోనా ఉగ్రరూపం: 18 లక్షలు చేరిన కేసులు.. 39 వేలకు చేరిన మరణాలు

  Aug 04 | దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోమారు... Read more

 • Kangana ranaut alleges gunshots fired near her residence in manali

  హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..!

  Aug 02 | బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ గా ఇటీవలే ముద్రపడిన కంగనా రనౌత్ ఇంటివద్ద తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరగ్గా అమె... Read more

Today on Telugu Wishesh