(Image source from: Timesofindia.indiatimes.com)
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు పదహేడు వేల మార్కును దాటాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను ఎంతో కలవరానికి గురిచేస్తున్న మరణాలు.. ప్రతీ రోజు రాష్ట్రంలో సంభవిస్తుండడం అందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఏకంగా మరణాలలో 267 మార్కును చేరడం అందోళన రేకెత్తిస్తోంది. దేశంలో వందకుపైగా మరణాలు నమోదు చేసుకున్న తొమ్మిదవ రాష్ట్రంగా నమోదైన తెలంగాణ.. ఇక ఇటు కరోనా కేసులలోనూ పైకి ఎగబాకుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా రాష్ట్రంలో రోజుకు వేయ్యి మేర కేసులు నమోదు కావడం రాష్ట ప్రజలను అందోళనకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వలయంలా చుట్టేసింది.
అంతర్జాతీయ నగరంగా పేరోందిన హైదరాబాద్ నగరంలో ఎందరెందరో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నారు. కానీ కరోనా దెబ్బకు ఇక్కడి కంటే తమ స్వస్థలమే సురక్షితమని పెట్టా పేలా సర్ధుకుని వెళ్లిపోతున్నారు. జనవరి నెలలో అద్దె ఇళ్ల కోసం వెతికాన కనబడని టూలెట్ బోర్డు.. ఇప్పుడు ప్రతీ వీధిలోనూ దర్శనమిస్తోంది. వలస కార్మికులు, పలు రంగాలకు చెందినవారు ఐటీ సహా ఆధారిత రంగాలకు చెందిన వారు అనేక మంది మహానగరాన్ని వదిలి తమ స్వస్థలాకు వెళ్తున్నారు. వలస కార్మికులపై లాక్ డౌన్ ప్రభావం వెంటనే పడగా, తాజాగా అదే ప్రభావం వలసవచ్చిన విభిన్న రంగాలకు చెందినవారిపై కూడా పడింది.
ఏప్రిల్ నెలలో గణనీయంగా తగ్గిన కేసులు మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా జూన్ నెలలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు పలు సడలింపులు తీసుకురావడంతో జనజీవనం వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం అగడం లేదు. ఇవాళ తాజాగా నమోదైన కేసులలోనూ అత్యధిక కేసులు గ్రేటర్ కు పరిధిలోనివే కావడం గమనార్హం.
గత పక్షం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా పదిహేను వేల మార్కును అధిగమించాయి, దీంతో 17 వేలకు పైగా కరోనా కేసుల నమోదు చేసుకున్న 9వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 881 కోరానా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇవాళ గ్రేటర్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లోనూ కరోనా కేసులు అధికసంఖ్యలో నమోదయ్యాయి.
అయితే గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల కన్నా అధికసంఖ్యలో హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 17000 మార్కును దాటిన విషయం తెలిసిందే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి అసుపత్రులలో చికిత్సపోందుతూ ఏడుగురు అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 267కు చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం.
తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 1018 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 17,357 కేసులు నమోదయ్యాయి, గ్రేటర్ పరిధిలో 881 కేసులు నమోదు కాగా, ఇక రంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ జిల్లా పరిధిలో 36, నల్గొండ జిల్లాలో 4, సంగారెడ్డి పరిధిలో 2 కేసులు, మహబూబ్ నగర్ 10, కరీంనగర్ 2, గద్వాల్ 1, సూర్యాపేట 1, ఖమ్మం 7, కామారెడ్డి జిల్లాలో రెండు, సిద్దిపేటలో మూడు, వరంగల్ రూరల్ జిల్లాలో 9, ఆసిఫాబాద్ 2, మెదక్ 2, అదిలాబాద్ 2, యాదాద్రి జిల్లాలో 2, నిజామాబాద్ జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, కరోనా బారినపడిన బాధితులు కోలుకొని మొత్తంగా 8082 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,008 యాక్టివ్ కేసులు వున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more