Petrol, diesel rates unchanged for second straight day రెండో రోజు ఇం‘ధనం’ విరామం.. ధరలు పెంచని చమురు సంస్థలు

Atf price hiked by 7 5 petrol diesel rates unchanged for second straight day

petrol, diesel, petrol price, diesel price, petrol price hike, diesel price hike, fuel prices in india, Dharmendra Pradhan, GST, Value Added Tax, VAT, Excise Duty on petrol

petrol and diesel prices were unchanged for the second day in a row. This, after diesel rates scaled a new high after prices were hiked 22 times in just over three weeks. In Delhi, a litre of petrol comes for Rs 80.43 per litre, while diesel is priced at Rs 80.53 per litre. Rates vary from state to state depending on the incidence of local sales tax or VAT.

రెండో రోజు ఇం‘ధనం’ విరామం.. ధరలు పెంచని చమురు సంస్థలు

Posted: 07/01/2020 01:27 PM IST
Atf price hiked by 7 5 petrol diesel rates unchanged for second straight day

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ కు గత నెల రోజులుగా డిమాండ్ పేరుగిన క్రమంలో దేశంలో ఇంధన ధరలు కూడా అంతకంతకూ అమాంతంగా పెరుగుతూ వచ్చాయి. ఏకంగా రెండేళ్ల గరిష్టస్థాయిని కూడా అందుకుని మరింతపైకి ఎగబాకుతున్నాయి. ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ పన్నులు, వ్యాట్ ధరలు కలుపుకుని ఏకంగా 64శాతం మేర పొందుతున్నాయని, ఇక వాహనదారుడికి మాత్రం అంతర్జాతీయ మార్కట్ ధరల లభ్దిని చేకూర్చకుండా.. వాయింపులను మాత్రం మోయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. సంస్థలు ధరల పెంపుపై వెనక్కు తగ్గడం లేదన్న వాదనలు వినిపించాయి. గతంలో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర 100 ప్లస్ డాలర్ల చేరిన సందర్భాల్లోనూ మన దేశంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. కానీ అంతర్జాతీయంగా ధరలు సాధారణంగా కొనసాగుతున్నా.. మన దేశంలో మాత్రం వరుసగా ఇరవై ఒక్క రోజులుగా పెరుగిన ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెట్టాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.14 శాతం పెరుగుదలతో 41.73 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.35 శాతం పెరుగుదలతో 39.80 డాలర్లకు ఎగసింది. అయినా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాల్సిన చమురు సంస్థలు ఇవాళ ధరల పెంపుకు విరామాన్ని ప్రకటించాయి. గత మూడు వారాలుగా ఇప్పటికే పెట్రోల్ పై పది రూపాయల మేర ధర పెరగ్గా, డీజిల్ పై పదకోండు రూపాయల మేర దర పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి.

దేశంలో గత మూడు వారాలుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గత ఆదివారం ఒక్కరోజు ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం మళ్లీ బాదుడు మొదలైంది. ఈ క్రమంలో రెండు రోజుల తరువాత ఇవాళ బుధవారం పెట్రో ధరల నుంచి వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ కూడా ధరల పెంపుకు ఇంధన కంపెనీలు విరామం ప్రకటించాయి, దీంతో నిన్నటి ధరల వద్దే పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.80.43 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.80.53 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.87.19 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.83 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. దేశీ ఇంధన ధరలు ఈరోజు కూడా స్థిరంగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా స్థిరంగానే రూ.78.69 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర ధర రూ.83.82 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్‌ ధర కూడా రూ.78.98 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.83.43 వద్దనే ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.62 వద్ద నిలకడగానే కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Revolutionary balladeer vangapandu prasada rao passes away

  జనపద జానపదగళం మూగబోయింది.. వంగపండు ఇకలేరు..

  Aug 04 | ప్రజాగాయకుడు, విప్లవ రచయిత, జానపద కళాకారుడు, ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ఉత్తరాంధ్ర జనం పాట ఊపిరి వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస... Read more

 • Ex cpm mla from telangana sunnam rajaiah dies of covid 19

  మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కాటేసిన కరోనా

  Aug 04 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ప్రజల ప్రానణాలతో చెలగాటం ఆడుతోంది. ఇన్నాళ్లు సామాన్యుల ప్రాణాలను టార్గెట్ చేసుకుని కబళించిన కరోనా.. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇటీవలే... Read more

 • Covid 19 update with 1286 new covid 19 cases telanganas tally surges near 69000 mark

  తెలంగాణలో కరోనా విజృంభన: 24 గంటల్లో 1286 కేసులు.. 12 మరణాలు

  Aug 04 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా అరవై తోమ్మిది వేల మార్కుకు చేరువలో వున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా... Read more

 • Coronavirus cases in india records spike of over 50000 cases tally tops 18 5 lakh

  దేశంలో కరోనా ఉగ్రరూపం: 18 లక్షలు చేరిన కేసులు.. 39 వేలకు చేరిన మరణాలు

  Aug 04 | దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోమారు... Read more

 • Kangana ranaut alleges gunshots fired near her residence in manali

  హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..!

  Aug 02 | బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ గా ఇటీవలే ముద్రపడిన కంగనా రనౌత్ ఇంటివద్ద తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరగ్గా అమె... Read more

Today on Telugu Wishesh