(Image source from: Telugu.oneindia.com)
ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత వరప్రసాద్ (పీవీపీ) దౌర్జన్యాలకు అంతులేకుండా సాగుతున్నాయి. విధులకు ఆటంకం కల్గించారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పీవీపీపై కేసు నమోదు చేశారు. ఓ రాజకీయ నేతగా, అందులోనూ ఏకంగా పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసిన వ్యక్తి ఎంతో హుందాగా ప్రవర్తించాలి కానీ.. ఏకంగా నవ్విపోదురు గాక నాకేటి అన్నట్లుగా వ్యవహరించి మరీ మరో కేసులో అడ్కంగా బుకయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం కూడా నేరమన్న విషయం తెలిసా.? తెలియదా.? అన్న విషయాన్ని పక్కనబెడితే.. ఆయన చేసిన చర్యలతో పోలీసులకే కాదు అటు నియోజకవర్గ ప్రజల్లో, ఇటు సినీవర్గాల్లోనూ ఆయన ఇమేజ్ కు నష్టం వాటిల్లిందని చెప్పకతప్పదు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తన ఇంటికి ఎదురుగా వున్న ఇంటి నిర్మాణం చేపట్టకుండా.. నిర్మించుకోకుండా అడ్డుకోవడంతో పాటు దౌర్జన్యం చేశారని సదరు ఇంటి యజమాని పోలీసులకు పిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. తన నుంచి విల్లాను కొనుగోలు చేసిన వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాదాపు 20 మంది రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి, సదరు కొనుగోలుదారుణ్ని చంపేస్తానని బెదిరించారు. ఈ గొడవ కేసులో అరెస్ట్ చేయడానికి పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు. దీంతో పీవీపీ వ్యవహారంపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సాయంత్రం బంజారాహిల్స్ పీఎస్కు వెళ్లిన సీపీ అంజనీకుమార్ కు వారు పివీపి విషయమై పిర్యాదు కూడా చేశారు. ఆయన సూచనల మేరకు పివీపిపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, అరెస్టు కోసం వెళ్తే పెంపుడు కుక్కలను ఉసిగోల్పాడని పోలీసలు కేసు నమోదు చేశారు. కాగా, పివీపి నుంచి విల్లాను కొనుగోలు చేసిన బాధితుడు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లో ‘ప్రేమ్ పర్వత్ విల్లాస్’ పేరిట పీవీపీ కొన్ని నిర్మాణాలు చేశారు. వీటిలో ఓ విల్లాను 4 నెలల కిందట విక్రమ్ కైలాస్ అనే వ్యాపారి కొనుగోలుచేశారు. అనంతరం, ఆయన తన విల్లాను ఆధునీకరించాలని భావించి పనులు మొదలు పెట్టారు. అయితే, ఈ ఆధునీకరణ పనులతో తన ఇంటి ఎలివేషన్ దెబ్బతింటోందని, పనులు ఆపేయాలని పీవీపీ హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more