India to gradually end govt control on gas pricing గ్యాస్ ధరలపై నియంత్రణలో చేతులెత్తేయనున్న కేంద్రం

India to gradually end govt control on gas pricing dharmendra pradhan

Union Oil Minister Dharmendra Pradhan, government control on gas pricing, gas prices linked, market forces, oil companies, petrol and diesel prices, state oil marketing companies, jet fuel

Union Oil Minister Dharmendra Pradhan said India will gradually end government control on gas pricing and will instead gradually make gas prices linked to market forces. He also said that the country's current fuel demand is at 85% of June 2019 levels and that by end of second quarter of FY21, fuel demand will be as usual.

గ్యాస్ ధరలపై నియంత్రణలో చేతులెత్తేయనున్న కేంద్రం

Posted: 06/27/2020 07:11 PM IST
India to gradually end govt control on gas pricing dharmendra pradhan

పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్రం తాజాగా గ్యాస్‌ ధరలపై కూడా అంచెలవారీగా అదే విధానాన్ని కొనసాగించనుంది. ధశలవారీగా గ్యాస్ ధరలను కూడా మార్కెట్‌ శక్తులకు అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గ్యాస్‌ ధరలపై నిర్ణయాధికారాన్ని ధశలవారీగా వదిలేస్తామని ఆయన సెలవిచ్చారు. గ్యాస్ ధరలను మార్కెట్ కు అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఎన్టీఏ తొలిహయంలోనూ ఇంధన మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టిన ధర్మేంద్రప్రధాన్.. పెట్రోల్ ధరలు పెరిగిన ప్రతీ సందర్భంలోనూ త్వరలో ఇంధన ధరలను జీఎస్టీ పరిధీలోకి తీసుకువస్తామని ప్రకటించారు.

ధరలు పెరిగిన ప్రతీసారి చెప్పిన మాటను కనీసం రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన సందర్భంలోనూ అమలులోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇక ఆ మధ్య ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పి తప్పించుకున్నారు. దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపి పాలిత ప్రభుత్వాలే వున్నాయి. రాష్ట్రాలతో ప్రధాని మాట్లాడితే వాహనదారులపై ప్రత్యక్షంగా, నిత్యావసరాలపై పరోక్షంగా ప్రభావం పడుతుంది. దేశప్రజలకు దరల ఉపశమనం కల్పించే ఈ చర్యలకు మంత్రివర్యులు పూనుకోవడం లేదు. కాగా తాజాగా గ్యాస్ ధరల నియంత్రణపై కూడా చేతులెత్తేస్తున్నట్లు ప్రకటించడం ప్రజలను అందోళనకు గురిచేస్తొంది.

ఇప్పటికే అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు మాత్రం వాహనదారుల నుంచి ముక్కు పిండి డబ్బులను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. చమురు సంస్థలు అదే స్థాయిలో అంతర్జాతీయంగా ఇంధర ధరలు తగ్గిన క్రమంలో మాత్రం ఆ ఫలాలను వాహనదారులకు కల్పించడం లేదు. చమురు సంస్థలు నష్టపోతున్నాయని, లేదా.., ఎక్సైజ్ పన్ను పెంచుతూ లేదా.. ధరలను గరిష్టస్థాయిలోకి పయనింపజేస్తున్న వైనం సర్వత్రా విమర్శలను ఎదుర్కోంటోంది. ఇక ఇదే సమయంలో గ్యాస్ ధరలపై నియంత్రణను వదిలేసి.. వాటి ధరలను కూడా అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానం చేస్తే ఇక గ్యాస్ ధరలను కూడా అకాశంలోనే వెతుక్కోవాల్సి వస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles