TRAI launches new TV Channel Selector app మీ కావాల్సిన ఛానెళ్లు ఇక మీ చేతిలో..

Trai launches new channel selector app for dth cable tv customers

TRAI Channel Selector App, Telecom Regulatory Authority of India, TRAI Channel Selector App Android download, TRAI Channel Selector, DTH connection, Cable bill, TRAI new tariff order, TRAI, DTH services, New Tariff Order, Tata Sky, Dish TV, Airtel TV

The Telecom Regulatory Authority of India (Trai) has announced the launch of a new channel selector app for all television subscribers across DTH (direct-to-home) and cable services to be able to view, modify and optimize channel packs irrespective of their distribution platform.

మీ కావాల్సిన ఛానెళ్లు ఇక మీ చేతిలో.. వాటికే బిల్లు చెల్లింపు

Posted: 06/27/2020 02:31 PM IST
Trai launches new channel selector app for dth cable tv customers

మీరు కేబుల్ టీవీ కనెక్షన్ తీసుకున్నారా? డీటీహెచ్ వాడుతున్నారా? మీరు కేబుల్, డీటీహెచ్ చానెళ్లు కావాలా..? అయితే వారిచ్చిన ఫ్యాకేజీలోనే చానెళ్లను ఎంచుకోవాలని కండీషన్ పెట్టారా.? ఇకపై అలాంటి షరతులకు చీటీ చెల్లింది. ఇకపై మీకు కావాల్సిన ఛానెళ్లను మాత్రమే చూడండీ.. వాటికి మాత్రమే బిల్లను చెల్లించండీ అన్న ట్రాయ్ గత ఏడాది కేబిల్ టీవీ, డీటీహెచ్ లలో మార్పులు చేసింది. ఇక తమ నిబంధనను కేబుల్, డీటీహెచ్ అందరూ పాటించాలను ఆదేశించింది. వారితో ఇది సాధ్యపడదని భావించిందో ఏమో కానీ కస్టమర్లకు చెంతకు అందుబాటులోకి చానెల్ సెలక్టర్ యాప్ ను తీసుకువచ్చింది.

ఇందుకోసం టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-ట్రాయ్ కొత్తగా ఓ యాప్ లాంఛ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. మీరు మీ కేబుల్ టీవీ లేదా డీటీహెచ్‌లో చూడాలనుకుంటున్న ఛానెళ్లు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఎంత బిల్ అవుతుందో సులువుగా తెలుసుకోవచ్చు. టాటాస్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్‌టీవీ, డీ2హెచ్, హాత్‌వే డిజిటల్, సిటీ నెట్వర్క్‌, ఏషియానెట్, ఇన్‌డిజిటల్ లాంటి డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఎంఎస్‌ఓలకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ట్రాయ్ ఛానెల్ సెలక్టర్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో, యాపిల్ ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ కేబుల్ లేదా డీటీహెచ్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేయాలి. మీ సబ్‌స్క్రిప్షన్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ కేబుల్ టీవీ, డీటీహెచ్ ఛానెల్ ప్యాక్స్‌ను మాడిఫై చేయొచ్చు. ప్రస్తుత సబ్ స్క్రిప్షన్ కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఛానెళ్ల జాబితాలో మరిన్ని ఛానెల్స్ యాడ్ చేయొచ్చు. గతేడాది ట్రాయ్ కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ కేంద్రం టీవీ వీక్షకులకు అరచేతిలో వైకుంఠాన్ని చూపింది.

దేశంలోని నగరప్రాంతాల్లో రూ.200 నుంచి 250 ధరకు అన్ని ఛానళ్లను వీక్షించే సగటు బుల్లితెర వీక్షకుడిని తమ బేజుళ్లోంచి వందలాది రూపాయలను వెచ్చించేలా చేస్తోంది ప్రస్తుత విధానం. ఇక గ్రామీణ ప్రాంతంలో కేవలం 150 నుంచి 200 రూపాయల మధ్యలో మాత్రమే గ్రామీణ ప్రాంతంలో వెచ్చించేవారు. కానీ ప్రస్తుత విధానంతో తాము ఎంచుకున్న చానెళ్లకు మాత్రమే అంతకన్నా అధికంగా డబ్బును చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వందలాది చానెళ్లు ప్రసారం అయినా తక్కువగానే చెల్లించే విధానమే తమకు మంచిదని, ఎంచుకున్న చానెళ్లలతో బోర్ కొట్టినప్పుడు మిగతా చానెళ్లను మార్చుకోవచ్చునని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRAI  DTH services  New Tariff Order  Tata Sky  Dish TV  Airtel TV  TRAI Channel Selector App  

Other Articles