GIRL bitten by dog while making TIK TOK రోడ్డుపై పిచ్చిపిచ్చిగా డాన్స్.. యువతి పిక్కపై కుక్క కాటు

Omg dog bites girl while making tiktok video goes viral

TikTok video, nights on the streets, videos, viral tictok video, tiktok stars, tictok viewers, Tik tok, stray dog, youngstes, young girl, addiction, china app, viral video, video viral

Most of the youngsters addicted to TikTok app and always tries to do some videos to gain the attention of TikTok viewers. Recently, a TikTok video is surfacing on the internet in which a woman was bitten by a street dog while doing a TikTok video on the streets.

ITEMVIDEOS: రోడ్డుపై పిచ్చిపిచ్చిగా డాన్స్.. యువతి పిక్కపై కుక్క కాటు

Posted: 06/26/2020 10:41 PM IST
Omg dog bites girl while making tiktok video goes viral

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ.. అన్ లాక్ 1.0 అమల్లోకి వచ్చినా.. ఇప్పటికే దేశ ప్రజల్లోని సగం మంది కరోనా కాటుకు దడిచి రాత్రిళ్లు అసలు రోడ్డుపైకే రావడం లేదు. ఉదయం పూట బిజీగా కనిపించే వీధులు ఇక రాత్రి సమయాల్లో నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీంతో ఊరంతా ఒక చింత అంటే ఊసుకళ్ల వాడికి మాత్రం ఒకటే చింత అన్న చందాన.. సోషల్ మీడియాలో స్టార్ గా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న పలువురు మాత్రం రాత్రి పగలుతో పనిలేదు.. తమకు అనిపించింది చేసేయాలి.. వెంటనే దానిని తమ సోషల్ మీడియాలో పోస్టు చేయ్యాలి. ఇక లైకులు, వ్యూస్ రాబట్టాలి అన్నదోక్కటే వారి ద్యాస.

అయితే దేశంలో అన్ లాక్ 1.0 అమల్లోకి వచ్చిన క్రమంలోనూ మూగ జీవాల దయనీయ పరిస్థిత్లులో ఏమాత్రం మార్పురాలేదు. మరీ ముఖ్యంగా వీధి కుక్కల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వాటికి అన్నం పేట్టే వారు కరువయ్యారు. గతంలో వాటికి కనీసం ఎక్కడో ఒక చోట వాటికి ఎదో ఒక అహారం లభించేది. కానీ కరోనా మహమ్మరి నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తరువాత  వాటికి ఇప్పటికీ కడుపునిండా ఆహారం లభించిన పరిస్థితి లేదు. ఆహారం లభించే చోట వాటిలో వాటికి అధిక పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో వాటికి ఏద కనబడినా అది తినే వస్తువుగానే భావించి.. క్షణం అలోచించకుండా నోటితో కొరికేస్తున్నాయి.

అయితే టిక్ టాక్ కు వీధి కుక్కలకు ఏమిటీ సంబంధం అంటారా.? టిక్ టాక్ లో ఓ వీడియోను పోస్టు చేసేందుకు ఖాళీగా వున్న ఓ వీధిలోకి తన స్నేహితులతో వెళ్లిన యువతి.. అక్కడ వీర లెవల్లో రెచ్చిపోయి డాన్స్ చేస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ శునకం.. నేరుగా యువతి వెనక్కు వచ్చింది. అమె జేబులో ఏదో వస్తువులా కనిపించడంతో దానిని తినే వస్తువు అనుకుందో ఏమో కానీ.. దానిని అందుకునే ప్రయత్నంలో తన నోటితో కరచుకుంది. ఒక్కసారిగా వీధికుక్క తనను కరవడం చూసి టిక్ టాక్ స్టార్ అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది. ఈ వీడియో పోస్టు చేసిన అమె స్నేహితుడు ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకోవాలని గాయానికి వైద్యం చేస్తున్న వీడియోను జతపర్చి సోషల్ మీడియాలో పెట్టగా, అది కాస్తా వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tik tok  stray dog  youngstes  young girl  addiction  china app  viral video  video viral  

Other Articles