ATM Cash Withdrawal Rules from July 1st ఏటీయం నుంచి నగదు విత్ డ్రాకు కొత్త రూల్స్

No free transactions in atm from july 1 check out new rules

atm withdrawal limit,atm withdrawal charges,atm withdrawal limit per day,atm withdrawal limit sbi,atm withdrawal limit icici,atm withdrawal limit pnb,atm withdrawal limit hdfc,atm withdrawal limit obc,atm withdrawal amount,atm withdrawal amount not received,atm withdrawal amount limit,atm withdrawal application,atm rules and regulations,atm rules,atm rules in india,atm transaction rules,new atm rules in india,new atm rules,atm rules india,ATM,Business,SBI

During lockdown, transactions in any bank ATM was made free until June 30. The waiver was announced for three months - April, May, June. Unless there is no new announcement on this, the waiver will end in June. So from July 1, the customers will have to abide by the bank rules regarding the number of ATM withdrawals.

కరోనా వైరస్: ఏటీయం నుంచి నగదు విత్ డ్రాకు కొత్త రూల్స్

Posted: 06/25/2020 11:25 PM IST
No free transactions in atm from july 1 check out new rules

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా బ్యాంకులు తమ కస్టమర్లకు అనేక సడలింపులు ఇచ్చాయి. వీటిలో భాగంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు ఉపసంహరణకు నిబంధనల్ని మార్చి కస్టమర్లకు ఊరట కలిగించాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజలు నగదు లేకుండా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో బ్యాంకులు కస్టమర్ల సౌలభ్యం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం సర్వీస్ ఛార్జీలను తొలగించింది. అంటే ఉచిత ట్రాన్సాక్షన్స్ తర్వాత ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే ప్రతీ సారి సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉండేది. కానీ లాక్ డౌన్ కాలంలో ఈ ఛార్జీలను ఎస్బీఐ తొలగించింది. ఎస్బీఐ ఏటీఎంలు మాత్రమే కాదు, ఇతర బ్యాంకుల ఏటీఎంలో డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది.

అయితే ఈ నెలాఖరుతో ఈ తరహా లావాదేవీలకు మినహాయింపులు ముగియనున్నాయి. అయితే బ్యాంకులు కానీ, ఆర్టీఐ కానీ ఇప్పటి వరకు ఏటీయం కేంద్రాల్లో లావాదేవీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జూన్ 30 వరకు ఏటీఎం సర్వీస్ ఛార్జీలు లేవని ముందే స్పష్టం చేయగా, ఆ తరువాత మళ్లీ అంతకుముందు కోనసాగిన నిబంధనలే వర్తిస్తాయా.? లేక పోడిగింపు వర్తించనుందా అన్న విషయంలో ఇంకా సంగ్ధిధత నెలకొంది. ఎస్బీఐ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. ఇప్పటివరకైతే ఈ సడలింపుల పొడిగింపుపై బ్యాంకుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి జూలై 1 నుంచి గతంలో ఉన్న ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్ అమలులోకి వచ్చే అవకాశముంది.

జూలై 1 నుంచి అన్ని బ్యాంకులు తమ ఏటీఎం విత్‌డ్రాయల్ నిబంధనల్ని తిరిగి అమలు చేయొచ్చు. అదే జరిగితే కస్టమర్లకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ తగ్గిపోతుంది. ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ గతంలో ఉన్నట్టే ఉంటుంది. ఎస్‌బీఐ విషయానికొస్తే మెట్రో నగరాల్లో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి 8 ఉచిత ట్రాన్సాక్షన్స్‌ని ఇస్తోంది బ్యాంకు. 5 సార్లు ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి. నాన్ మెట్రోలో 8 ఉచిత ట్రాన్సాక్షన్స్‌ని ఇస్తోంది ఎస్‌బీఐ. 5 సార్లు ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, 5 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇంతన్నా ఎక్కువసార్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే ప్రతీ లావాదేవీపై రూ.20+జీఎస్‌టీ చెల్లించాలి. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్‌కు రూ.8+జీఎస్‌టీ చెల్లించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atm  cash withdrawal  withdrawal limit  atm withdrawal charges  sbi  icici  pnb  hdfc  obc  atm rules  atm transaction rules  

Other Articles