కరోనా వైరస్ వ్యాప్తి ఉద్దృతి రాష్ట్రంలో అధికం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ పరీక్షలతో పాటు ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంసీఏ సహా ఐటిఐ పరీక్షలను కూడా రద్దు చేయాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడంతో.. కేవలం గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేనాని కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దని కోరిన నేపథ్యంలో రెండు రోజుల వ్యవధిలో కీలక నిర్ణయాన్ని తీసుకుని ఆ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా పవన్ కోరిన వెంటనే డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసింది.
ఇవాళ ఉదయం పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన జనసేన పేరిట తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ప్రకటన ద్వారా కోరారు. పదో తరగతి విద్యార్థులకు కల్పించిన విధంగానే డిగ్రీ, పీజీ, ఐటీఐ, ఎంబీఏ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ వంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్ధులకు కూడా పరీక్షలను రద్దు చేయాలని కోరారు. ఈ విద్యార్థులకు కూడా ఇంటర్నల్ మార్కులతో పాటు గత సెమిస్టర్ల మార్కులను జతచేసి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల మేలు కోరి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
కాగా ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్‌లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చివరి సెమిషర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more