Col. Santosh Babu last rites today సైనిక లాంఛనాల మధ్య కల్నాల్ సంతోష్ అంత్యక్రియలు..

Colonel santosh babu last rites today in suryapet

Santosh Babu, b Santosh Babu, Eastern Ladakh, india china, india china faceoff, indo china border, Ladakh standoff, indian army, chinese army, Colonel Santosh Babu, Colonel B Santosh Babu, Tributes, Telanganites, congress

Colonel B. Santosh Babu, who was killed by the Chinese Army in Eastern Ladakh on Monday night, last rites to be performed by his family members with indian army salute respect today in kesaram village of Suryapet district in Telangana.

సైనిక లాంఛనాల మధ్య కల్నాల్ సంతోష్ అంత్యక్రియలు.. నివాళులర్పించిన ప్రముఖులు

Posted: 06/18/2020 11:07 AM IST
Colonel santosh babu last rites today in suryapet

లడఖ్ లోని గాల్వన్ లోయలో వద్ద సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణలో వీరమరణం పోందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహానికి ఇవాళ సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సంతోష్ బాబు అంత్యక్రియలు నిన్నే జరగాల్సివున్నా.. సంతోష్ బాబు స్వగ్రామానికి ఆయన పార్థీవ దేహం రావడానికి ఆలస్యమైంది. అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆయన పార్ధీవదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో బుధవారం జరగాల్సిన అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి, సూర్యపేటలోని కేసారంలో సంతోష్‌బాబు కుటుంబానికి ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు.

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో సంతోష్ బాబు అంత్యక్రియలకు కూడా పరిమితమైన సంఖ్యలోనే బంధువులను అనుమతించనున్నట్లు సూర్యాపేట కలెక్టర్ తెలిపారు. ఇక ఈ నిబంధనలు అమల్లో వున్నందున.. ఇప్పటికే పలువురు ప్రముఖుల ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి తమ తీవ్ర సానుబూతిని వ్యక్తం చేశారు. ఇక ఇవాళ ఉదయం కూడా ఆయన పార్థీవదేహాన్ని పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించారు.

వీరితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రితం రోజునే సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా, ప్రజల సందర్శనార్థం కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఈ ఉదయం 10 గంటల వరకు ఉంచనున్నట్టు పేర్కొన్నారు. పార్థివ దేహాన్ని సందర్శించే క్రమంలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనల ప్రకారం అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతించనున్నట్టు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Santosh Babu  Mother  Proud  Telanganites  Tributes  Eastern Ladakh  India  china  Face-off  congress  

Other Articles