Covid-19 scare: Total lockdown in four Tamil Nadu districts తమిళనాడులో నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్.. కఠినంగా అమలు

Covid 19 scare tamil nadu announces full lockdown in chennai other parts as coronavirus cases rise

Chennai, Tamil Nadu, complete lockdown, Chennai, novel coronavirus, Covid-19, Chennai coronavirus news, Chennai corona cases, Chennai Covid-19 cases, Chennia cases

Tamil Nadu government announced 'maximised restricted lockdown' from 19 to 30 June in four districts namley Kancheepuram, Tiruvallur and Chengalpet districts of the state, including Chennai in wake of the novel coronavirus outbreak. This also includes full scale shutdown on two Sundays, the government added.

తమిళనాడులో నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్.. కఠినంగా అమలు

Posted: 06/15/2020 09:00 PM IST
Covid 19 scare tamil nadu announces full lockdown in chennai other parts as coronavirus cases rise

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో తమిళనాడు ప్రభుత్వానికి శరాఘాతంలో పరిణమించింది,. ఇది ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయనుందని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో అటు వాటి నుంచి తప్పించుకునేందుకు.. ఇటు ప్రజలు ప్రాణాలను కూడా పరిరక్షించేందుకు తరుణోపాయంలా కనిపిస్తున్న లాక్ డౌన్ ను మళ్లీ రాష్ట్రంలో విధించాలని యోచిస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కరోనా కేసుల ప్రభావం అధికంగా వున్న రాజధాని చెన్నై సహా నాలుగు జిల్లాల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి 30 వరకు ఈ నాలుగు జిల్లాల్లో పూర్తిస్థాయిలో సంపూర్ణంగా లాక్ డౌన్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి నిర్ణయించారు.  సీనియర్‌ ఉన్నతాధికారులతో ఈ నిపుణుల కమిటీ దాదాపు గంటకు పైగా సమావేశమై చర్చించిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య, వైద్య నిపుణుల బృందం ప్రభుత్వానికి సూచించింది. అందుకుగానూ ప్రభుత్వానికి పలు కీలక సూచనలను సైతం చేసింది. దీంతో సమావేశంలో రాస్ట్రంలోని కిలకమైన నాలుగు జిల్లాలో లాక్ డౌన్ విధించనున్నట్లు సీఎం పళనిస్వామి వెల్లడించారు. చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్ పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాల్లో జూన్‌ 19 నుంచి 30 వరకు కఠిన లాక్ డౌన్‌ పూర్తిస్థాయిలో అముల చేయనున్నామని చెప్పారు.

ఈ జిల్లాలన్నీ చెన్నై మహానగరం పరిధిలోవే కావడం అందునా మెట్రోపోలిటిన్ పోలీస్ పరిధిలోనివే కావడం గమనార్హం. తాజా లాక్ డౌన్ కొనసాగే 12 రోజుల్లో వచ్చే రెండు ఆదివారాల్లో మాత్రం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉంటుందని సీఎం స్పష్టంచేశారు. ఆ రెండు రోజుల్లో మాత్రం వేటికీ మినహాయింపులు ఉండబోవన్నారు. దేశంలో నమోదైన అత్యధిక కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. నిన్నటివరకు ఆ రాష్ట్రంలో 44,661 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 430మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో 24,547మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

లాక్‌డౌన్‌ నిబంధనలివే..

 

* నిత్యావసర సర్వీసులకు మినహాయింపు

* ఎమర్జెన్సీలో తప్ప అద్దె క్యాబ్‌లు, ఆటో సర్వీసులకు అనుమతిలేదు.

* ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం ఉద్యోగులతో పనిచేస్తాయి.

* కంటైన్‌మెంట్ జోన్‌ల పరిధిలో నివసించే ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు.

* జూన్‌ 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి.

* కూరగాయల దుకాణాలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే పనిచేస్తాయి.

* హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు పనిచేస్తాయి. అయితే, పార్శిల్స్‌కు మాత్రమే అనుమతి.

* రేషన్‌, నిత్యావసర సరకుల దుకాణాలు, మొబైల్‌ షాప్‌లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేస్తాయి.

* టీ దుకాణాలకు అనుమతిలేదు.

* ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాకు మినహాయింపు.

* అమ్మ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచన్లు యథాతథంగా పనిచేస్తాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles