Two India High Commission officials missing in Pakistan పాకిస్తాన్ లో ఇద్దరు భారత దౌత్యాధికారుల మిస్సింగ్..

Two indian high commission officials go missing in islamabad mea takes up matter with pakistan

India, Pakistan, Indian High Commission, Indian High Commission officials, Indian High Commission Islamabad, Indian High Commission Pakistan, Indian embassy in Pakistan, politics

Two Indian officials working with the Indian High Commission in Pakistan's capital Islamabad went missing on Monday. The two officials have been unreachable for the past few hours now. The Indian mission in Pakistan has taken up the matter with the local authorities as well as Pakistan's Foreign Ministry.

పాకిస్తాన్ లో ఇద్దరు భారత దౌత్యాధికారుల మిస్సింగ్..

Posted: 06/15/2020 03:50 PM IST
Two indian high commission officials go missing in islamabad mea takes up matter with pakistan

దాయాధి దేశం పాకిస్థాన్ లో ఇద్దరు భారత్‌ దౌత్య అధికారులు అదృశ్యమయ్యారు. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు అదృశ్యం కావడం ఇప్పడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు భారత దౌత్య అధికారుల మిస్సింగ్‌ గురించి పాకిస్థాన్‌ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ విషయాన్ని పాకిస్థాన్ యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం నుంచి వారు కనిపించకుండా పోయారని వార్తలు వస్తున్నప్పటికీ.. వాస్తవానికి వారు ఎప్పట్నించి కనించడం లేదన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.

గతంలో భారతీయ రాయబార కార్యాలయానికి చెందిన అధికారులపై వేధింపులకు పాల్పడిన చరిత్ర పాకిస్థాన్ కు వుంది. గతంలో కారులో ఇంటికి వెళ్తున్న భారత దౌత్యఅధికారి గౌరవ్ అహ్లువాలియాతో సహ మరికొందరిని పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ద్విచక్ర వాహనాలపై వెంబడించి వేధింపులకు గురిచేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాతో పాటు పాకిస్థాన్ మీడియాలోనూ వార్తలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి, ఇదే తరుణంలో ఇప్పుడు మరో ఇద్దరు భారత రాయభార కార్యాలయానికి చెందిన అధికారులు కనిపించకుండా పోవడంపై అలాంటి చర్యలే ఏమైనా జరిగాయా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అయితే ఇవి ఖచ్చితంగా భారతపై జరుగుతున్న వ్యతిరేక చర్యలు, కక్షసాధింపు చర్యల్లోనే భాగంగా సాగుతున్నాయని అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదానికి స్వర్గధామంగా నిలచిని పాకిస్తాన్ పై ప్రపంచ దేశాలన్ని కర్నార్ చేస్తున్న తరుణంలోనూ దాయాధి దేశం తమ అరచకాలను అడ్డుఅదుపులేకుండా బరితెగింపుతో కొనసాగిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి, ఇటీవల ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయానికి చెందిన సిబ్బంది గూఢచర్యానికి పాల్పడటంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని భారత దౌత్యకార్యాలయం సిబ్బందిపై ఆ దేశ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles