Indian-origin doctor in U.S. performs double lung transplant for coronavirus survivor కరోనా రోగికి జీవం పోసిన భారత సంతతి వైద్యుడి ఘనత

Indian origin doctor in us performs double lung transplant for coronavirus survivor

double lung transplant, coronavirus patient, coronavirus lungs, lung transplant usa, ankit bharat, Indian origin surgeon, Northwestern Memorial Hospital, chicago, Ventilator, corona patient on heart-lung machine, America

Surgeons in Chicago have given a new set of lungs to a young woman with severe lung damage from COVID-19. Only a few other COVID-19 survivors, in China and Europe, have received lung transplants. The Chicago patient is in her twenties and was on a ventilator and heart-lung machine for almost two months before her operation at Northwestern Memorial Hospital.

అగ్రరాజ్యంలో కరోనా రోగికి జీవం పోసిన భారత సంతతి వైద్యుడి ఘనత

Posted: 06/12/2020 04:21 PM IST
Indian origin doctor in us performs double lung transplant for coronavirus survivor

కరోనా వైరస్‌ బారినపడిన రెండు ఊపిరితిత్తులు పాడైపోయిన యువతికి భారతీయ సంతతికి చెందిన వైద్యుడు విజయవంతంగా వాటిని మార్పిడి చేశాడు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని షికాగోలో జరిగిందీ ఘటన. ఇక్కడి నార్త్ వెస్టర్న్ మెడిసిన్‌ ఆసుపత్రిలో 20 ఏళ్ల యువతి చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆమె రెండు ఊపిరితిత్తులు పాడైన విషయాన్ని గుర్తించిన వైద్యులు వాటిని మార్చాలని నిర్ణయించారు. కాగా అమెకు విజయవంతంగా శస్త్రచికిత్స చేయడంలో అక్కడి వైద్యుల బృందం సక్సెస్ అయ్యింది. ఈ బృందానికి భారతీయ సంతతికి చెందిన వైద్యుడు నేతృత్వం వహించాడు.

కరోనా మహమ్మారి ప్రారంభమయ్యాక అమెరికాలో ఇలాంటి ఆపరేషన్‌ నిర్వహించడం ఇదే మొదటిసారి అని భావిస్తున్నారు. భారత సంతతి వైద్యుడు, థొరాసిక్ సర్జన్ నిపుణుడైన డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలో ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఇరవై ఏళ్లలో వున్న యువతి కరోనా వైరస్ తీవ్రత వల్ల అమె ఆరువారాల పాటు వెంటిలేటర్, ఎక్సట్రాకార్పోరియల్ మెంబరేన్ ఆక్సిననేషన (ఎక్మో)పై ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ఎక్మో యంత్రం రోగి గుండె, ఊపిరితిత్తులు చేసే విధులను నిర్వర్తించే ప్రాణాధార యంత్రమని చెప్పారు.

ఈ నెల ప్రారంభంలో యువతి ఊపిరితిత్తులు, చికిత్సకు వీలుకాని స్థాయిలో దెబ్బతిన్నాయని గుర్తించామని, దీంతో అమెకు రెండు ఊపిరితిత్తులు ట్రాన్స్ ప్లాంట్చేయాలని నిర్ణయించామని చెప్పారు. దీంతో 48 గంటల తరువాత అమెకు సర్జరీ చేశామని చెప్పారు. కరోనా రోగికి అమెరికాలో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ ఇదే మొదటిది కావడం గమనార్హం. కరోనా బాధితుల్లో అవయవ మార్పిడి ఆపరేషన్ చాలా సవాళ్లతో కూడుకున్నదని ఈ సందర్భంగా డాక్టర్ అంకిత్ తెలిపారు. తప్పని పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు శస్త్రచికిత్స నిర్వహించవచ్చన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఊపిరితిత్తులు సేకరించినట్టు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles