ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి 2020 సంవత్సరం అచ్చిరాలేదు. ఇప్పటికే ఓ వైపు ప్రకృతి విలయాలు చోటుచేసుకుంటుండగా, మరోవైపు నుంచి కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. దీని ప్రభావం దాటికి ప్రప్రంచంతో పాటు ఆర్థిక పురోగతి. జనజీవనం కూడా స్థంభించింది. దీంతో అసలే సినిమాలు, సినిమా షూటింగ్ లు లేక చిత్రపరిశ్రమ కూడా కుదేలైంది. ఈ తరుణంలో ఓ కన్నడ నటి తీసుకున్న విపరీత చర్య మూలంగా చిత్రపరిశ్రమలో విషాధచాయలు అలుముకున్నాయి. తాను నమ్మినవాడే నట్టేట ముంచేయడంతో తన జీవితం ప్రశ్నార్థకంగా మారిందని ఆమె మానసిక దిగ్ర్భాంతికి లోనయ్యారు.
దీంతో నటి చందన విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరులోని తన నివాసంలో ఆమె ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే ఈ విపరీత నిర్ణయం తీసుకోవడానికి తన ప్రియుడు దినేష్ మోసమే కారణమని చెప్పింది. ఈ మేరకు తన మరణాన్ని కూడా సెల్ఫీ వీడియో తీసుకున్న నటి దానిని తన ఫ్ఱెండ్స్ కు షేర్ చేశారు. అయితే ఈ ఘటన జరిగింది 28న కానీ ఈ వీడియోను అమె స్నేహితులు చూసిందీ ఇవాళ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి కావాలనే కలతో చందన బెంగళూరుకు వచ్చారు. తన స్వగ్రామమైన హసన్ జిల్లా బేలూరుకు చెందిన అమె.. చిన్న చిన్న పాత్రలతో సిరపెట్టుకున్నారు. చిత్రసీమతో పాటు కన్నడ బుల్లితెరలోనూ నటించారు. పలు ప్రకటనల, సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. ఈ క్రమంలో దినేష్ తో పరిచయం ఏర్పడింది. గత ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.
అయితే పెళ్లి చేసుకోమని అడగగా.. దినేష్ నిరాకరించాడు. కనీసం వారి తల్లిదండ్రులకు విషయం చెబితే.. వారైనా అండగా నిలుస్తారని ఆశించింది కానీ వారు కూడా తననే నిందింది.. అవమానం చేశారు. అంతేకాదు తిట్టి పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చందన.. విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డింది. తన ప్రియుడు దినేష్ తనను మోసం చేశాడని, వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి, పెళ్లికి నిరాకరిస్తున్నాడని చనిపోయే ముందు రికార్డు చేసిన చివరి వీడియోలో ఆరోపించారు. అందుకే తాను విషం తాగానని చెప్పారు. కాగా స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే అమె పరిస్థితి విషమించి మరణించింది. ఈ మేరకు పోలీసులు దినేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దినేష్ పరారీలో ఉన్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more