Landslides leave 20 dead, 9 injured in south Assam అస్పోంలో మహా విషాదం.. కొండచరియలు విరిగిపడి..

20 dead in landslides in south assam several injured

Assam Landslides, Assam weather, Barak valley region, Cachar district, Hailakandi district, Karimganj district, Sarbananda Sonowal, Assam

At least 20 people have died in a series of landslides that took place in Assam today. The dead are largely from three different districts of the Barak valley region in southern Assam. Several others are injured. Rescue teams have been rushed to the sites.

అస్పోంలో మహా విషాదం.. కొండచరియలు విరిగిపడి..

Posted: 06/02/2020 09:05 PM IST
20 dead in landslides in south assam several injured

అసోంలోని మహావిషాదం జరిగింది. వరుసగాఘటనల్లో పలు జిల్లాల్లో విరిగిపడిన కొండచరియల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. బరాక్ లోయ ప్రాంతాల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదాల్లో మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. దక్షిణ అస్సోం రాష్ట్రంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ లు ఘటనాస్థలానికి చేరుకుని శిధిలాల కింద వున్న బాధితులను రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక అసుపత్రులకు తరలించారు.

గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో పలు జిల్లాలకు చెందిన కూలీలు ఉన్నట్లు సమాచారం. అస్సోం జిల్లాలో కాచర్ జిల్లాలో ఏడుగురు, హోయ్ లా ఖండీ జిల్లాలో ఆరుగురు, కరీంగంజ్ జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కాగా మరణించిన వారిలో సగం మంది చిన్నారులే వున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కోన్నాయి. ఈ విషాద ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్.. హుటాహుటిన రంగంలోకి దిగి క్షతగాత్రులకు సాయం అందించాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని అదేశించారు.

గత కొన్ని రోజులుగా అస్సోం భారీగా కురిసిన వర్షాలతో వరదలు వచ్చాయి. సోమవారం నుంచి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కాగా వరదల్లో తొమ్మిది మంది మరణించారు. ఈ వరదల్లో ఏడు జిల్లాలు చిక్కుకున్నాయి. వరదల బారిన పడటంతో లొత్తట్టు ప్రాంతాలకు చెందిన సుమారు రెండు లక్షల మంది ముంపుకు గురయ్యారు. ఇక వరదల ప్రభావం తీవ్రంగా వున్న ఏడు వేల మందిని అధికారులు 45 సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదల ధాటికి ఏకంగా 25వందల హెక్డార్ల పంటకు తీవ్రనష్టం వాటిల్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam Landslides  Barak valley  Sarbananda Sonowal  Assam  weather  

Other Articles