AP High Court revokes Nimmagadda Ramesh Kumar as SEC రాష్ట్ర ఎన్నికల అధికారి.. నిమ్మగడ్డ రమేష్ పునర్నియామకం

Set back to ap government in high court sec n ramesh kumar removal revoked

AP High Court, Nimmagadda Ramesh Kumar, State Election Commissioner, Revoked, AP GO Thrashed by High court, IAS officers, Retd Judges, YS Jagan, Kanagarajan, Andhra Pradesh, Politics

A high court bench comprising chief justice J K Maheshwari and Justice Satyanarayana Murthy cancelled the ordinance issued by the Jagan government on May 10 making amendment to AP Panchayat Raj Act reducing the tenure of state election commissioner from five to three years and appointing a judicial officer of the rank of a high court as the SEC in place of bureaucrats.

ITEMVIDEOS: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఎస్ఈసీగా రమేష్ కుమార్: హైకోర్టు

Posted: 05/29/2020 02:13 PM IST
Set back to ap government in high court sec n ramesh kumar removal revoked

ఆంధ్రప్రదేశ్  స‌ర్కారుకు మ‌రోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. రాష్ట్ర మాజీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ ను తొల‌గిస్తూ రాష్ట్రంలోని జగన్ సర్కార్ జారీ చేసిన జీవో చెల్ల‌ద‌ని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. దీంతో పాటు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ గా మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజన్ నియామ‌కం, ప‌ద‌వీకాలం స‌హా ప‌లు నిబంధ‌న‌లు మారుస్తూ జారీ చేసి ఆర్డినెన్స్ ను కూడా న్యాయ‌స్థానం కొట్టేసింది. పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌, జీవో జారీలపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ ప‌ద‌వీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్ల‌కు త‌గ్గించి.. మాజీ ఐఏఎస్ ల‌ను కాకుండా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులను నియ‌మించేలా నిబంధ‌న‌లు మార్చుతూ తీసుకువచ్చిన జీవోలను కొట్టివేసింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్ఈసీగా ఉన్న నిమ్మ‌గ‌డ్డ‌కు ప‌ద‌వీ కాలం మూడేళ్లు పూర్త‌యిందంటూ జ‌గ‌న్ స‌ర్కారు ఆయ‌న్ని తొల‌గిస్తూ జీవో జారీ చేసింది. కొత్త రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ గా రిటైర్డ్ న్యాయమూర్తి జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్ ను నియ‌మించిన విషయం తెలిసిందే. ఆయన రాష్ట్ర ఎస్ఈసీగా పదవీ బాద్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో కోనసాగాల్సిన స్థానిక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలను రమేష్ కుమార్ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో వాయిదా వేయడంతో ప్రభుత్వం తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని రమేష్ కుమార్ ఆరోపించారు. తనను పదవి నుంచి తొలగించిందని అన్నారు. దురుద్దేశంతోనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేశారు. ఈ పిటీషన పై విచారించిన న్యాయ‌స్థానం నిమ్మ‌గ‌డ్డ‌ రమేష్ కుమార్ నే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా కొన‌సాగించాల‌ని తీర్పును వెలువరించింది. ప్ర‌భుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని, ఆర్టిక‌ల్ 213 ప్ర‌కారం ఆ ఆర్డినెన్స్ చెల్ల‌ద‌ని పేర్కొంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles