Dr Sudhakar alleges wrong medication at mental hospital డాక్టర్ సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు హైకోర్టు అదేశం

I am being given psychiatric drugs unnecessarily alleges vizag doctor sudhakar

Doctor Sudhakar., Visakhapatnam doctor, High Court, Vizag mental hospital, wrong medication, CM YS Jagan, Visakha Police, Conspiracy, AP Police, CBI Probe, Central Bureau of Investigation, Andhra Pradesh, Politics

Visakhapatnam anesthetist Dr Sudhakar Rao Kolaventy wrote a letter to the medical superintendent of the mental hospital, where he has been lodged since May 16 on the belief that he needs treatment for mental stress. Sudhakar complained of being given medicines that are not required for him. The drugs are affecting his health. He released a photo of his lips dried up due to drugs.

నాపై మందుల ప్రయోగం.. సైకోగా మార్చే ప్రయత్నం: డాక్టర్ సుధాకర్

Posted: 05/28/2020 01:45 PM IST
I am being given psychiatric drugs unnecessarily alleges vizag doctor sudhakar

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా గళమెత్తిన డాక్డర్ సుధాకర్ తాజాగా ప్రభుత్వం తనపై మందులను ప్రయోగాన్ని చేస్తోందని దీంతో తాను సైకోగా మారే ప్రమాదముందని అనుమానాలను వ్యక్తం చేశారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అనెస్థీషియన్ గా పనిచేస్తున్న డాక్టర్‌ సుధాకర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని విశాఖ మానసిక వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తోంది.

ఈ క్రమంలో డాక్డర్ సుధాకర్ రావు తనపై మందుల ప్రయోగం చేస్తూ.. సైకోగా మర్చేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మానసిక ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్‌ రాధారాణికి నాలుగు పేజీల లేఖ రాశారు. తనకు రోజు రాత్రివేళ ఇస్తున్న నాలుగు రకాల మాత్రలు.. ఒక ఇంజక్షన్ చేస్తున్నారని పేర్కోన్నారు. వీటితో తన పెదాలు తడి అరిపోతున్నాయని, కళ్లు కూడా మసకబారుతున్నాయని, ఆయాసం వస్తోందని, తల తిరుగుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కోన్నారు. పెదవులపై పుండ్లు అవుతున్నాయని, తనకు పలు రకాల మానసిక రోగాలకు సంబంధించిన మందులు ఇస్తున్నారని ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.

అయితే డాక్టర్ సుధకార్ మానసిక రుగ్మతకు సంబంధించిన మందులనే తాము ఇస్తున్నామని ఇందులో ఎలాంటి తప్పుడు డ్రగ్స్ లేవని.. వాటితో సుధాకర్ అరోగ్యానికి ఎలాంటి హాని వుండదని మానసిక ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్‌ రాధారాణి తెలిపారు. అయితే ఎం మెడికేషన్ ఇస్తున్నామన్న విషయం బయటకు చెప్పకూడదని అన్నారు. అయితే ప్రతీరోజు డాక్యుమెంటేషన్ జరుగుతోందని.. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ వ్యవహరం న్యాయస్థానంలో వున్నందున్న.. రాష్ట్ర హైకోర్టు కోరిన పక్షంలో సుధాకర్ ఇస్తున్న మందుల వివరాల డాక్యుమెంటేషన్ ను సమర్పిస్తామని చెప్పారు. అయితే తన కొడుకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుదాకర్ తల్లి కావేరమ్మ డిమాండ్ చేశారు. తన కొడుకు వ్యవహరంపై హైకోర్టు సిబిఐ విచారణకు అదేశిస్తే.. దానిని ఎదుర్కోలేని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందంటేనే ఏదో కుట్ర జరుగుతుందన్న విషయం వ్యక్తమవుతుందని అమె అనుమానం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles