Virginia family finds nearly $1M in cash on road నడిరోడ్డుపై డబ్బుల మూటలు దొరికితే.. మీరేం చేస్తారు..!

Virginia family out for ride finds nearly 1 milli7 11 pm 5 20 2020on in road

$1 Million, million dollars, money bags, $1M in cash on road, Virginia family, family out for a ride found cash on road, coronavirus, lockdown, cash bags, Covid-19, America, US

A Virginia family out for a ride to get a change of scenery after being holed up at home due to the coronavirus found nearly $1 million in two bags lying in the road.

నడిరోడ్డుపై డబ్బుల మూటలు దొరికితే.. మీరేం చేస్తారు..!

Posted: 05/20/2020 02:18 PM IST
Virginia family out for ride finds nearly 1 milli7 11 pm 5 20 2020on in road

అగ్రరాజ్యంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో పలురాష్ట్రాలు కూడా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఇంట్లోనే రోజుల తరబడి వుండిపోయిన కుటుంబం సరదాగా బయటకు వెళ్లేందుకు రెడీ అయ్ియంది. అంతే అనుకున్నదే తడవుడా ఆ కుటుంబం సరదాగా విహారానికి బయలుదేరింది. మార్గమథ్యంలో వారికి రెండు సంచులు రోడ్డుపై పడి వున్నాయి. అవి చెత్త సంచులనుకుని ఓ సంచిపై నుంచి తమ కారు వెళ్లింది. ఇంతలో కుటుంబంలోని మహిళకు అనుమానం కలిగింది. దీంతో కారును రోడ్డు పక్కకు నిలిపి.. వచ్చి చూడగా.. ఆ సంచిలో డబ్బులు దర్శనమిచ్చాయి. ఈ లోగా మరికోంత దూరంలో మరో సంచి అందులోనూ డబ్బే.

వారి స్థానంలో ఎవరు వున్నా.. తమను ఎవరైనా గమనిస్తున్నారా.? అంటూ రోడ్డుకు ఇరువైపులా చూసి.. ఆ డబ్బు సంచులను కారులో తీసుకుళ్తూ.. తమ విహారాన్ని మరింత రంజుగా మార్చుకుంటారు. కానీ వీరు అలా చేయకుండా నిజాయితీగా వ్యవహరించారు. తమది కాని సొత్తుపై ఆశపడకూడదని ఏకంగా ఆ నగర పోలీసుల వద్దకెళ్లి మరీ డబ్బు సంచులను అందించారు. వీటిని తమ ఓనర్లే అందించాలని మరీ కోరారు. ఇంతకీ ఆ డబ్బు సంచులలో ఎంతమేర డబ్బు వుందో తెలుసా.? ఇది జరిగింది అగ్రరాజ్యం అమెరికాలోని వర్జిన్యా నగరంలో. ఇక ఆ సంచులలో అక్కడి కరెన్సీ డాలర్లు వున్నాయి. ఎంత అంటే.. ఏకంగా ఒక మిలియన్ డాలర్లు.

అంటే సుమారుగా మన కరెర్సీలో ఏకంగా రూ.75 లక్షలు. ఇక డీటైల్స్ లోకి వెళ్తే.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన డేవిడ్‌ కుటుంబం సరదాగా బయటకు వెళ్లాలని నిర్ణయించుకుని తమ పికప్‌ ట్రక్ లో వెళ్లింది. మార్గమధ్యలో కరోలైన్‌ కౌంటీకి కొంత దూరంలో గూచ్ లాండ్‌ కౌంటీ వద్ద రోడ్డుపై వారికి ఓ‌ బ్యాగ్‌ కనిపించగా, చెత్త బ్యాగు రోడ్డుకు అడ్డంగా ఉందని.. దానిని దాటిన తరువాత కారు అపిన డేవిడ్ కుటుంబం.. ఆ బ్యాగును తమ ట్రక్ వెనుక వేసుకుని బయలుదేరింది. మళ్లీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వారు అప్పటికీ దానిని చెత్తే అని భావించారు.

కొంత దూరం వెళ్లాక వారికి మరో బ్యాగు కనిపించింది. దాన్ని కూడా ట్రక్‌ వెనకాల పడేసి, తమ టూర్‌ను కొనసాగించారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న అనంతరం ఆ బ్యాగులను తెరిచి చూడగా అందులో పెద్ద మొత్తంలో డబ్బు కనపడడంతో ఆశ్చర్యపోయారు. ఆ డబ్బు గురించి వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి డబ్బు సంచులకు సంబంధించిన సమాచారం అందించడంతో వారింటికి చేరుకున్న పోలీసులు రెండు బ్యాగుల్లో దాదాపు రూ.75 లక్షలు (1 మిలియన్‌ డాలర్లు) ఉన్నట్లు గుర్తించారు. ఆ డబ్బు ఎవరిదన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే డేవిడ్ కుటుంబం చేసిన పనితో పోలీసులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. వీరు ఒకరికి సంబంధించిన పెద్దమొత్తంలో డబ్బును సేవ్ చేశారని ప్రశంసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles