GVK Guard spots Leopard in Garden's swiming pool హిమాయత్ సాగర్ జివీకే గార్డెన్స్ లో చిరుత.. ఈసారైనా చిక్కేనా..?

Gvk guard spots leopard in garden s swiming pool drinking water

Leopard, Himayath Sagar, Reservoir, GVK Gardens, Swiming Pool, Aziz nagar, moinabad, Rajendra nagar, RangaReddy, Telangana, Crime

Panic gripped few villages around Himayatsagar on Tuesday afternoon after the watchman of GVK Gardens, had spotted a Leopard drinking water in swiming pool. He immidietly passed the information to the local police, who passed on the information to the forest officials.

హిమాయత్ సాగర్ జివీకే గార్డెన్స్ లో చిరుత.. ఈసారైనా చిక్కేనా..?

Posted: 05/19/2020 06:19 PM IST
Gvk guard spots leopard in garden s swiming pool drinking water

నడిరోడ్డుపై రెస్ట్ తీసుకుని స్థానికులను హడలెత్తించిన చిరుత.. అటవీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటోంది. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దానిని పట్టుకునేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా వాటిని అధిగమిస్తూ గత ఆరు రోజులుగా చిరత చిక్కకుండా పారిపోతోంది. రెండు రోజుల క్రితం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ లో నీళ్లు తాగుతూ కనిపించిందని కొందరు జాలర్లు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. అయినా తెలివిగా వ్యవహరించిన చిరుత తప్పించుకుంది.

ఇక తాజాగా మరోమారు చిరుత అచూకీ లభ్యమైంది. కానీ చిరుత మాత్రం తప్పించుకుంది. తాజాగా హిమాయత్‌సాగర్‌ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో నీళ్లు తాగుతుండగా.. వాచ్ మెన్ గమనించి హడలెత్తిపోయాడు. వెంటనే  చిరుత ఆచూకీ గురించి స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించారు. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. చిరుత జాడను ఖచ్చితంగా కనిపెట్టేందుకు గార్డెన్స్‌లోకి కుక్కలను వదిలి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మేకను ఎరవేసిన బోనుతోపాటు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

గత గురువారం హైదరాబాద్ శివార్లలోనే కాటేదాన్ అండర్ బ్రిడ్జి వద్ద నడిరోడ్డుపై చిరుత విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. చాలా సేపు అది అలా పడుకొని ఉండటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఫోన్లలో వీడియోలు తీశారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకునే సరికి అది తప్పించుకొని పక్కన ఉన్న ఫామ్‌ హౌస్ పొదల్లోకి పారిపోయింది. ఫామ్ ‌హౌస్‌లో ఉన్న చిరుతను పట్టుకోవడం కోసం డ్రోన్లతో గాలించారు. మేకలను ఉంచి రెండు బోన్లను ఏర్పాటు చేయడంతోపాటు.. కుక్కలను వదిలారు. ట్రాప్ కెమెరాలతో దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు. కానీ ఫామ్ హౌస్ గోడ దూకి వెళ్లిన చిరుత అగ్రికల్చర్ యూనివర్సిటీ మీదుగా తప్పించుకొని పారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles