'Villagers need periodic health checks for a year' ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ బాధితుల్లో కొత్త ఆరోగ్య సమస్యలు

Vizag gas tragedy locals farmers face new problems amid cisr

Visakha gas leak, RR Venkatapuram, LG Polymers, Experts committee, village Farmers, crop products, vegetable, Visakhapatnam, Andhra Pradesh

Avoid using vegetables, milk, groundwater from villages for few days, cautions panel. The ill-effects of styrene vapour leak from LG Polymers India Pvt Ltd’s (LGPI) plant in Visakhapatnam on the victims will be ‘long-lasting’ and they will need periodic health check-ups for a year.

గ్యాస్ లీక్ బాధితులకు పరిహారం.. వెంకటాపురం రైతులకు కొత్త సమస్యలు

Posted: 05/11/2020 06:15 PM IST
Vizag gas tragedy locals farmers face new problems amid cisr

విశాఖలో విషవాయువు లీక్ కావడంతో ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతంలోని ఐదు గ్రామాల్లోని చెట్లు చేమలు పూర్తిగా వర్ణం మారిపోయాయి. ఈ తరుణంలో ఈ గాలిని పీల్చి అస్వస్థతకు గురైన బాధితుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. దీంతో ఈ ఘటనలో స్టైరీన్‌ ప్రభావానికి గురైన బాధితులు తప్పనిసరిగా ఏడాది పాటు వైద్య పరీక్షలు చేయించుకోవాలని క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణుల బృందం తన సిఫార్సుల్లో పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా నిపుణులు మరో సూచనను కూడా చేశారు. అదే ఇప్పుడు ఈ ప్రాంత రైతులకు శాఫంగా పరిణమించింది.

అదేంటంటే ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ప్రభావం పొడచూసిన సమీప ప్రాంతంలో పండిన కూరగాయలు, పండ్లతో పాటు ఆహారధాన్యాలను కూడా ప్రజలు వినియోగించొద్దని ప్రజలకు సూచించింది. ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎస్‌ఐఆర్‌- ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణుల బృందం ఓ నివేదిక రూపొందించింది. సంబంధిత నివేదికను కేంద్రానికి పంపించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ బృందం పరిశ్రమ సమీపంలోని రహదారులు, ఇళ్లలో స్టైరీన్‌ అవశేషాలు గుర్తించింది. ఒక నివాసంలో అత్యధికంగా 1.7 పీపీఎం స్టైరీన్‌ను గుర్తించినట్లు తన నివేదికలో ఈ బృందం ప్రస్తావించింది.

నివాసాలు పూర్తిగా శుభ్రపరిచాకే తిరిగి వెళ్లాలని నిపుణుల బృందం సూచించింది. 5 గ్రామాలు, 3 కిలోమీటర్ల పరిధిలో పండిన కూరగాయలు, పండ్లను వినియోగించ రాదని చెప్పింది. ఇదే పరిధిలో గ్రాసాన్ని కూడా పశువులకు అందించవద్దని నిపుణుల బృందం సూచించింది. దీంతో ఇక్కడి రైతులకు సమస్య వచ్చిపడింది. అసలే లాక్ డౌన్ నేపథ్యంలో కాసింత సడలింపులు రాగానే పనులు చూసుకుంటున్న రైతులు తమ పంట ఉత్పత్తులకు ధరలు వస్తాయని అశిస్తున్న తరుణంలో ఎల్జీ పాలీమర్స్ తమ పాలిట శాఫంగా పరిణమించిందని బాధను వ్యక్తం చేస్తున్నారు. తమ పంటను తినేందుకు వీలు లేదని నిపుణుల బృందం సూచనలు జారీ చేయడంతో తమను కూడా ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

తమ పంటకు గిట్టుబాటు ధర మేరకు ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని స్థానిక ప్రభావిత రైతులు కోరుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో పర్యటించిన నిపుణుల బృందం విషవాయువు ప్రభావం పడిన మొక్కలను జీవీఎంసీ ద్వారా తొలగించాలని సూచించింది. తదుపరి నివేదిక వచ్చే వరకు స్థానిక పాల ఉత్పత్తులను వినియోగించరాదని సిఫార్సు చేసింది. తాగు, వంట కోసం బహిరంగ జల వనరులు వాడొద్దని, ప్రభావిత ప్రాంతాలను సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రపరచాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో వాహనాలను సైతం శుభ్రపరిచాకే వాడాలని తన సిఫార్సుల్లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles