Quick redressal for rich, trials delayed for poor: SC Judge దేశ న్యాయవ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

India s legal system favours the rich and powerful says retiring supreme court judge

Deepak Gupta, farewell address, Supreme Court, judicial independence, Justice Deepak Gupta farewell, Supreme Court Bar association, Constitution of India. India

Supreme Court Justice Deepak Gupta said that the country’s legal discourse is geared in favor of rich and powerful. He also asked judges to not “hide their heads like an ostrich" and they must identify problems with the judiciary and deal with them.

ధనవంతులకు అనుకూలంగా న్యాయవ్యవస్థ: సుప్రీంకోర్టు జడ్జీ సంచలన వ్యాఖ్యలు

Posted: 05/07/2020 06:02 PM IST
India s legal system favours the rich and powerful says retiring supreme court judge

దేశ న్యాయ వ్యవస్థపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంచలన అరోపణలు చేశారు. దేశంలో ప్రస్తుతం న్యాయవ్యవస్థ ధనికులకు, శక్తివంతులకు అనుకూలంగా మారిందని త్వరలో పదవీ విరమణ చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. ధనవంతుడి కేసులలో న్యాయ వ్యవస్థ వేగంగా పనిచేస్తుందని, పేదలకు సంబంధించిన వ్యాజ్యాల విచారణ మాత్రం ఆలస్యం అవుతుందని అన్నారు. మూడేళ్లుగా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న దీపక్ గుప్తా..తన పదవీ విరమణ సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడ్కోలు పొందిన మొదటి న్యాయమూర్తిగా గుప్తా చరిత్రలో నిలిచారు.

చట్టాలు, న్యాయ వ్యవస్థ ధనవంతులు, శక్తివంతమైనవారికి అనుకూలంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ధనవంతులు, శక్తివంతులు ఎవరైనా నిందితులుగా ఉంటే.. మరో ఉత్తర్వు వచ్చేంతవరకు ఉన్నత న్యాయస్థానాలను వారు ఆశ్రయించగలుగుతారు. సివిల్ వ్యాజ్యాలను ఆలస్యం చేయాలనుకుంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లగలుగుతారు. విచారణను కావాలని ఆలస్యం చేయగలరు. ఇది ఖర్చుతో కూడుకున్నది గనుక పేదలు అలా చేయలేనని గుప్తా అన్నారు. ఉష్ట్రపక్షిలాగా తల దాచిపెట్టుకుని న్యాయవ్యవస్థలో అంతా బాగానే ఉందని అనుకోవడం మంచిది కాదని, అందులోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు కృషి చేయాలని న్యాయమూర్తులకు సూచించారు.

న్యాయవ్యవస్థపై గొప్ప నమ్మకం ఉన్న మన దేశంలో దాని సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవ్యవస్థ సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూడాలని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. చుట్టూ ఉన్న సమాజంలో కూడా అంతా బావుందనే ఊహాలోకంలో న్యాయమూర్తులు ఉండకూడదని హితవు పలికారు. మైనర్‌ భార్యతో శృంగారం, ఆమె అనుమతి ఉన్నా.. రేప్‌ కిందకే వస్తుందని ఇచ్చిన తీర్పు, జైళ్ల సంస్కరణల తీర్పు, వాయు కాలుష్యంపై ఇచ్చిన తీర్పు మొదలైనవి వాటిలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles