దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో రెండవ విడత లాక్ డౌన్ మే 3న ముగియడంతో నాల్గవ తేదీ నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా దేశీయంగా పలు చిత్ర, విచిత్రవార్తలు కూడా ప్రధాన శీర్షికలుగా మారాయి. అందులో ఒకటి మద్యం దుకాణాల వద్ద మహిళల ప్రత్యేక క్యూ. మద్యం కొనేందుకు పురుషులతో పోటీ పడిన మహిళలు.. అన్నవి కామన్. ఇటు బెంగళూరు, అటు ఫూణే ఇలా చాలా ప్రాంతాల్లో మహిళలు మద్యం కొనేందుకు క్యూలైన్లలో వేచివున్న ఫోటోలు, వీడియోలు నెటింట్లోనే హల్ చల్ చేశాయి. ఇదే విషయమై తెలంగాణ రాష్ట్రానికి వస్తేనూ ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా ఇక్కడా అదే వార్త.
తెలంగాణలో ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చిన మద్యం అమ్మాకాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2300 మద్యం దుకాణాల్లో.. కంటైన్ మెంట్ జోన్లలోని 15 షాపులు మినహాయించి మిగతా అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎక్సైజ్ అధికారులు, యజమానులు వైన్ షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ లో భాగంగా బార్లు, పబ్బులు, క్లబ్ లు ఇతరాత్ర మద్యం సేవించే ప్రాంతాలన్నీ మూసివేయబడ్డాయి. దీంతో మద్యం అమ్మకాలు కేవలం వైన్ షాపుల్లో మాత్రమే లభించనుంది. దీంతో ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చిన మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు.
అయితే కార్పోరేట్ కల్చర్ ఇమిడివున్న హైదరాబాద్ మహానగరంలో సాప్ట్ వేర్ కంపెనీలలో పనిచేసే అనేక మంది మహిళలు మద్యాన్ని సేవిస్తుంటారు. దీంతో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ లోని పలు వైన్స్ ముందు మందుబాబులకు పోటీగా అమ్మాయిలు కూడా ఉదయాన్నే వచ్చి లైన్లో నిల్చున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మొఖాలకు మాస్కులు ధరించి మందు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆ తర్వాత లిక్కర్ తీసుకుని వెళ్లారు.. మరోవైపు కోఠిలోని బగ్గా వైన్స్ దగ్గర కొందరు మహిళలు క్యూలైన్లలో వచ్చి మందు తీసుకెళ్లారు. నగరంలోని పలు మద్యం షాపుల ముందు క్యూ కడుతున్నారు మహిళలు.. మద్యం కోసం పెద్ద ఎత్తున రోడ్ల మీదికి వచ్చిన మహిళలు.. ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్ సిటీలో.. ఐటీ సెక్టార్లోని పలు మద్యం షాప్ల దగ్గర క్యూకట్టి మద్యం కొనుగోలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more