Liquor price hike only with proportionate with neighbouring states తెరుచుకున్న మద్యం షాపులు.. ధర పెంపు అందుకేనన్న మంత్రి

Price hike of liquor only with proportionate with neighbouring states srinivas goud

Liqour Shops, Lockdown, Liquor rates hike, Coronavirus, Covid-19, Excise Minister, Srinivas Goud, Liquor prices in Telangana, wine shops in TS, Liquor sales, Liquor Purchase, liqour prices, Telangana, Politics

Telangana government has hiked the liquor price only with proportionate with other neighbouring states says Excise and Prohibition Minister Srinivas Goud today after the meeting held with excise officials in Nampally abkari Bhavan.

తెరుచుకున్న మద్యం షాపులు.. ధర పెంపు అందుకేనన్న మంత్రి

Posted: 05/06/2020 04:11 PM IST
Price hike of liquor only with proportionate with neighbouring states srinivas goud

తెలంగాణలో తొలిదశ లాక్ డౌన్ నుంచి మద్యం దుకాణాలకు పడిన తాళాలు ఇవాళ తెరుచుకున్నాయి. మద్యం వ్యాపారాలకు మందుబాబులు దుకాణాలు తెరిచే వేళకు స్వాగతం పలికారు. తెలంగాణలో ఏకంగా 42 రోజుల తరువాత దుకాణాలు తెరుస్తుండటంతో మందుబాబులు ఉదయం నుంచే సామాజిక దూరం పాటిస్తూ మద్యం దుకాణాల వద్ద క్యూలలో నిలబడి విక్రయాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అంటూ వేచిచూశారు. రాష్ట్రంలో నాటుసారా, గుడుంబా, మద్యం మాఫియా జడలు విప్పడం.. నకిలీ మద్యం రాకుండా కళ్లెం వేసేందుకే రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నాంపల్లిలోని అబ్కారీ శాఖలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గుడుండా నిర్మూలణకు చాలా కాలం ప్రయత్నించామని, అలాంటిది మద్యం అమ్మకాలు ప్రారంభించకపోతే మళ్లీ రాష్ట్రంలో గుడుంబా వ్యాపారం పెరుగుతుందని మద్యం దుకాణాలను తెరిచామని అన్నారు. ఇక కల్తీ మద్యం రవాణాను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చప్పారు. ఇక  మద్యం ధరల పెంపు అంశంపై కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఛీఫ్ లిక్కర్ పై 11 శాతం..మిగతా లిక్కర్ పై 16శాతం పెంచామని అన్నారు.

అయితే పోరుగు రాష్ట్రాలను చూసి తెలంగాణలోనూ మద్యం ధరలను పెంచక తప్పడం లేదని అన్నారు. ఢిల్లీలో 70శాతం, ఏపీలో 75శాతం మేర ధరలు పెంచారని, ఇక పోరుగున్న కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలలోనూ మద్యం ధరలపై కరోనా టాక్స్ ను విధించడంతో రెక్కలు వచ్చాయని అన్నారు. అయితే అలా ధరలను పెంచడం ఇష్టం లేని తెలంగాణ ప్రభుత్వం కొంతమేర ధరలను పెంచక తప్పని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. కేవలం పక్కరాష్ట్రాలతో ప్రపోర్షనేట్ టా వుండేందుకు మాత్రమే ధరలను పెంచామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles