liquor prices to raise in Andhra Pradesh again గిల్లాసు గొల్లుమంది.. మద్యం ధర మళ్లీ పెరగనుంది..

Liquor sales liquor prices to raise in andhra pradesh again

Liqour Shops, Lockdown, Women, Liquor prices in Andhra, wine shops in AP, Liquor sales in Andhra, Liquor Purchase, women purchase liquor, Andhra Pradesh

Andhra Pradesh government has decided to raise again the liquor prices by 50 per cent as it is prepares to open retail liquor stores run by the government-owned AP Beverages Corporation. The liquor sales resumed in the state, but at higher prices.

గిల్లాసు గొల్లుమంది.. మద్యం ధర మళ్లీ పెరగనుంది..

Posted: 05/05/2020 11:11 AM IST
Liquor sales liquor prices to raise in andhra pradesh again

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే పనిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌ రెండు విడతలు మందువాసన తగలని మద్యం ప్రియులకు.. మూడోవిడతతో వచ్చిన సడలింపులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో అదను చూసి మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెట్టిపనిలో నిమగ్నమైంది ప్రభుత్వం. అయినా నలబై రోజుల తరువాత అందుబాటులోకి వచ్చిన మద్యాన్ని కొనుగోలు చేసుకునేందుకే మందుబాబులు సుముఖత వ్యక్తం చేశారు. ఇక వీరి అనందానికి కట్టలు వేయడం చివరాఖరకు ప్రభుత్వానికి కూడా సాద్యపడలేదు. దీంతో మరోమారు ధరలను పెంచాలని.. దీంతోనే మందుబాబులను కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు వినబడుతున్నాయి.

మద్యం దుకాణాలకు పోటెత్తిన మద్యం ప్రియులను కట్టడి చేసేందుకు ఇక ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ధరలకు మళ్లి పెంచనుంది. మద్యం విరివిగా తాగే వారి సంఖ్యను మరింత తగ్గించాలని భావించిన ప్రభుత్వం మద్యం ధరలను యాభై శాతం మేర పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా మరో 50 శాతం మేర ధరలను పెంచాలని నిర్ణయించింది.  పెరిగిన ధరలు ఇవాళ్లి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని 15 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని కూడా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారులకు అదేశాలు జారీ చేసిందని సమాచారం. ఇక పెరిగిన ధరలపై ఉత్తర్వులు వెలువడే వరకు రాష్ట్రంలో అన్ని మద్యం దుకాణాలను అధికారులు మూసివేయించారు.

నిన్న తాజాగా మద్యం దుకాణాలను నలభై రోజుల తరువాత తెరవడంతో 25శాతం మేర ధరలను పెంచడంతో మద్యం ధరలు బాగా పెరిగాయి, ఇక తాజాగా 50శాతం మేర ధరలు పెరగడంతో ధరలు అమాతం పెరగనున్నాయని.. లాక్ డౌన్ కు ముందు రూ. 120 పలికే మద్యం ధర ఏకంగా రెండు వందల వరకు ధర పలికే అవకాశం వుంటుందని, ఇక రూ. 150 వుండే మద్యం సీసాపై రూ.250 అపైన ధర పలికే అవకాశం వుంటుందని, ఇక 150 కన్నా అధికంగా వున్న క్వార్టర్ ధర కూడా 300 వరకు పలకనుందని తెలుస్తోంది. ధరల పెంపుతో మద్యాన్ని తాగాలన్న తాగేందుకు సరిపడా డబ్బులేక కొంచెం కొంచెంగా మద్యాన్ని తాగడం.. చివరకు మద్యం త్యజిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles