village volunteer beaten to death in pachipenta of APలాక్ డౌన్ విషాదం: దాడిలో గాయపడ్డ గ్రామ వాలంటీర్ మృతి..

Village volunteer kona laxman rao beaten to death in pachipenta of ap

Corona, Corona Alert, Coronavirus, Coronavirus Crisis, village volunteer, kona laxman rao, saluru village, pachipenta mandal, vizianagaram, andhra pradesh, Coronavirus impact, Coronavirus India, Coronavirus outbreak, coronavirus pandemic, Covid_19, Covid_19 australia, Covid_19 india, COVID_2019, Lockdown in vizianagaram, coronavirus in andhra Pradesh

village volunteer Kona Laxman Rao beaten to death in saluru village of pachipenta mandal in Andhra Pradesh, for suggesting to follow Lockdown and be inside the house.

లాక్ డౌన్ విషాదం: దాడిలో గాయపడ్డ గ్రామ వాలంటీర్ మృతి..

Posted: 04/29/2020 11:35 AM IST
Village volunteer kona laxman rao beaten to death in pachipenta of ap

లాక్ డౌన్‌ సమయంలో బయటికి రావొద్దన్నందుకు వాలంటీరుపై దాడి చేసిన ఘటన కందిరివలసలో చోటుచేసుకుంది. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో వారం తరువాత వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు కూడా తమ వంతు బాధ్యతగా ఆయా గ్రామాల్లో లాక్ డౌన్ ను పకడ్బంధీగా అమలు చేసేందుకు పోలీసులకు సహకరిస్తున్నారే. ఈ క్రమంలో విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని కదిరివలస గ్రామంలో వాలెంటీర్ కూడా లాక్ డౌన్ లో ఇళ్లు వదిలి బయటకు రావద్దని గ్రామస్థులకు సూచించడంతో వారు దాడి చేయడంతో వారం రోజులుగా అసుపత్రిలో చికిత్స పోందుతూ మృతిచెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పనుకువలస పంచాయతీ కందిరివలస గ్రామ వాలంటీరు కోన లక్ష్మణరావు (23) ఈ నెల 18న కరోనాపై ఇంటింటికి అవగాహన కల్పిస్తూ.. ఎవరూ బయటకు రాకూడదని సూచించాడు. కరోనా వ్యాధి అత్యంత ప్రమాదకారి అని.. అది సోకిన తరువాత వారం పది రోజుల వరకు సోకిన వ్యక్తికి కూడా సోకిందన్న విషయం తెలియదని, ఈ లోపు రోగితో పాటు పయనించే వైరస్ అతను కలసిని ప్రతీ వ్యక్తికి చేరుతుందని కూడా సూచించాడు. కరోనావైరస్ పై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ వెళ్తున్నలక్ష్మణరావుకు రోడ్డుపై తిరుగుతున్న గాదిపల్లి చిన్నారావు కనిపించాడు.

దీంతో అతన్ని ఇంట్లోకి వెళ్లాలని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నెల 20న ఒంటరిగా ఉన్న లక్ష్మణరావుపై చిన్నారావు, అతని తండ్రి సన్యాసి, సోదరుడు రామకృష్ణ దాడి చేశారు. బాధితుడిని తల్లిదండ్రులు సాలూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. లక్ష్మణరావు ఈ నెల 26న పాచిపెంట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. తరువాత అతడికి నయం కాకపోగా జిల్లా కేంద్రాసుపత్రికి, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు సీఐ ఎస్‌.సింహాద్రినాయుడు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles