ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల విజృంభన రోజురోజుకూ పెరుగుతోంది. మార్చిలో లాక్ డౌన్ విధించే సమయానికి కూడా పెద్దగా లేని కరోనా సాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం అంతకంతకూ పెరుగుతూపోతొంది. పోరుగునున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుండగా, ఏపీలో మాత్రం కరోనా పంజావిసురుతోంది. వైద్య సిబ్బందికి సవాల్ విసురుతున్న మహమమారి.. తన ఉధృతిని కొనసాగిస్తోంది. గ్రీన్ జోన్ ప్రాంతాలు కూడా ప్రభావితం చేస్తూ వ్యాప్తిచెందుతున్న కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది.
ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ లింకు బయటపడిన తరువాత వారం పది రోజుల పాటు కరోనా వైరస్ రాష్ట్రంలో పెద్దగా వ్యాప్తించలేదు. లాక్ డౌన్ విధించిన తరువాతే ఇంత భారీ సంఖ్యలో వైరస్ వ్యాప్తి చెందడం అందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఏకంగా వెయ్యి మార్కును దాటడం రాష్ట్ర ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 1177కి చేరింది.
ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరణాలు నమోదు చేసుకోనప్పటికీ.. పోరుగు రాష్ట్రాలతో పోల్చిచే 31 మరణాలు సంభించడం కలవరానికి గురిచేస్తోంది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 171 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణాలో 33, కర్నూలులో 13, గుంటూరు జిల్లాలో 23 కేసులు, నెల్లూరులో 7 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులు, శ్రీకాకుళంలో ఒక్క కేసు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1177కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 911 మంది చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు నమోదు కాగా, తాజాగా మరో మరణంతో మొత్తంగా 9 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 237 కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి.
నెల్లూరు-79 కేసులు రెండు మరణాలు, కృష్ణా-210 కేసులు, మరో మరణంతో మొత్తంగా ఎనమిది మరణాలు నమోదయ్యాయి, ప్రకాశం- 56, పశ్చిమగోదావరి-39, చిత్తూరు-73, విశాఖపట్నం-22, కడప జిల్లాలో 58 కేసులు, అనంతపురం-53 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 39 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా నాలుగు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more