Watch: Tiruppur police puts together a hilarious video లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడితే.. అంబులెన్స్ ఎక్కాల్సిందే..!

Watch tamil nadu cops put lockdown violators in ambulance with fake covid 19 patient

lockdown impact, coronavirus, coronavirus in Tamil nadu, lockdown violators in tirupur, Tamil nadu coronavirus cases, coronavirus cases in Tamil nadu, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Tamil nadu, Tabilghi jamat Tamil nadu cases, Nizamuddin event Tamil nadu

In Tamil Nadu's Tirupur district, cops stationed at a checkpoint in the city, came up with a quirky idea to teach lockdown violators a lesson. In a video that's going viral, the cops can be seen stopping men riding in threes on two-wheelers without a mask.

లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడితే.. అంబులెన్స్ ఎక్కాల్సిందే..!

Posted: 04/24/2020 10:08 AM IST
Watch tamil nadu cops put lockdown violators in ambulance with fake covid 19 patient

కరోనా వైరస్‌ కట్టడికి లాక్ డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు విన్నవిస్తున్నా ఆ విన్నపాలను తమకు వర్తించవన్నట్లు వ్యవహరించే   పలువురు మాత్రం యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసులు వీరిపై లాఠీలు జుళిపించారు. కొన్ని చోట్లు మోకాళ్లపై నిలబడి దండాలు పెట్టి చెప్పారు. తమకు తోచిన విధంగా పోలీసులు సామ, దాన బేద, దండోపాయాలను వినియోగించినా.. నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య పెరుగుతూనే వుంది. దీంతో కఠినంగా వ్యవహరించినప్పటికీ మార్పు రాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.

ముఖ్యంగా కరోనా ప్రభావం అధికంగా వున్న ప్రాంతాల్లో లాక్ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య అధికం అవుతోంది. పోలీసులు ఫ్రిగా లాఠీలతో టాటూలు వేసినా.. ఉల్లంఘించేవారు వేరే మార్గాల గుండా పయనిస్తూ.. వారి నుంచి తప్పించుకుంటున్నారు. దీంతో ఎంత కఠినతరం చేసినా ఉల్లంఘనలకు పాల్పడే వారి సంఖ్య మాత్రం తగ్గకపోవడంతో పోలీసులు తాజాగా ఒక తరుణోపాయం అవలంభించారు. తాజాగా తమిళనాడులోని తిరుపూర్లో ఏ పనీ లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన యువకులను స్థానిక పోలీసులు వినూత్నంగా భయపెట్టారు. ఓ వ్యక్తికి కరోనా పేషెంట్‌ మాదిరిగా దుస్తులు వేసి అంబులెన్స్‌లో పడుకోబెట్టారు.

నిబంధనలు ఉల్లంఘించి రహదారిపైకి వచ్చిన యువకులను బలవంతంగా ఆ అంబులెన్స్‌లోకి ఎక్కించారు. దీంతో లోపలి వ్యక్తిని కరోనా బాధితుడిగా భావించి భయపడిన సదరు యువకులు అంబులెన్స్‌ నుంచి బయటపడేందుకు పడిన తంటాలు పలువురికి నవ్వు తెప్పిస్తున్నాయి. ఆకతాయిలను కొట్టకుండా ఇలా పోలీసులు తీసుకున్న నిర్ణయంపై పలువురి నుంచి ప్రశంసలు వస్తుంటే, ‘భయపడి జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు?’ మరికొందరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఇందుకు ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles