175 Children tested positive in greater hyderabad చిన్నారులను చిదిమేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి

Coronavirus 175 children tested positive in greater hyderabad

coronavirus, Greater Hyderabad, Telangana coronavirus, telangana covid 19, GHMC coronavirus, GHMC covid-19, GHMC children corona, coronavirus deaths in Telangana, coronavirus death in Hyderabad, COVID-19, coronavirus cases, COVID-19 pandemic, corona virus Telangana, coronavirus greater hyderabad, coronavirus updates, coronavirus breakout, coronavirus spread, Crime

According to sources coronvirus fatility in Telangana includes infants and childres too. In Greater Hyderabad Area covid-19 has infected 175 children.

కరోనా వైరస్: తెలంగాణలో చిన్నారులను చిదిమేస్తున్న మహమ్మారి

Posted: 04/22/2020 10:56 AM IST
Coronavirus 175 children tested positive in greater hyderabad

కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఈ రాకాసి కాలగర్భంలో కలసిపోతుందా.. అని ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అగ్రదేశాలతో పాటు అభివద్ది చెందుతున్న దేశాలన్నీ ఎప్పుడు ఈ మహమ్మారి అంతం చెందుతుందా.? అని వేచిచూస్తున్నాయి. అందుకు కారణం ఈ మహమ్మారి తన కబంధహస్తాలలో ఎందరెందరినో చేజిక్కించుకోడమే. అంతేకాదు మరెందరినో కబళించి వేయడం. ఇక ఈ మహమ్మారి భారత్ దేశంలోనూ జడలు విప్పుతోంది.

ఇప్పటికే లాక్ డౌన్ విధించినా.. 20 వేల మార్కు దాటిన తన ప్రభంజనాన్ని చాటుతున్న కరోనా మహమ్మారి.. అటు అభంశుభం తెలియని అమాయక చిన్నారులను, తల్లలు పర్యవేక్షలో వుండే శిశువులను కూడా పట్టిపీడిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత దయనీయంగా మార్చేసింది. పుట్టిన బిడ్డలను సైతం పట్టిపీడిస్తూ ప్రాణాలను హరిస్తుండటం.. కనీసం కన్నవారు కూడా వెంటలేకుండా.. సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించకుండానే బందుజనం కూడా లేకుండానే చివరి చూపులు కూడా దక్కకుండానే సంస్కారాలు పూర్తి చేయాల్సి వస్తోంది.

గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోనూ పంజా విసురుతోన్న కరోనా మహమ్మారి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పలువురు ఈ వైరస్ బారినపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో 14 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 75 మందికి ఈ వైరస్ సోకింది. 16 ఏళ్లలోపు వారు సుమారు 70 మందికి ఈ వైరస్ సోకిందని సమాచారం.కరోనా సోకిన పిల్లలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైద్రాబాద్ పరిధిలోని ఆసిఫ్‌నగర్ గంజేషాహి దర్గాకు చెందిన 11 నెలల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఈ నెల 17వ తేదీన ఆసుపత్రికి తీసుకొచ్చారు.  రెండు రోజుల తర్వాత ఈ నెల 19న బాలుడు మరణించాడు.  అయితే అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆ బాలుడికి కరోనా సోకిన విషయం తేలింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నూతనంగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాకు చెందిన 45 రోజుల శిశువును ఈ నెల 15వ తేదీన నిలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడికి పరీక్షలు నిర్వహిస్తే కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు. కరోనా సోకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడ ఉన్నారు. కరోనా సోకిన పిల్లలు మర్కజ్ కానీ, విదేశాలకు వెళ్లినట్టుగా రికార్డులు లేవు. కానీ, వారికి ఎలా కరోనా వైరస్ ఎలా సోకిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. మర్కజ్ నుండి లేదా విదేశాల నుండి వచ్చిన వారి నుండి పిల్లలకు కరోనా సోకినట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారిలో పెద్దలు, పిల్లలతో పాటు ముగ్గురు గర్భిణులు, ఒక బాలింత కూడా ఉంది. వీరంతా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిని కరోనాబారి నుంచి బయటపడవేసేందుకు అసుపత్రి వైద్యులు ప్రత్యేక శద్రవహిస్తున్నారు. కరోనా సోకిన నిమ్స్ లో పనిచేసే ఓ నర్సు తన ఇంట్లోని బాలుడితో సన్నిహితంగా మెలగడంతో ఆ బాలుడికి కరోనా సోకింది. దీంతో ఆ ఇంట్లో ఉన్నవారిని క్వారంటైన్ కు తరలించారు. మంగళ్ హాట్ కు చెందిన ఆటో డ్రైవర్ కొడుకు అనారోగ్యానికి గురికావడంతో  ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కరోనా సోకినట్టుగా తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : COVID-19 pandemic  coronavirus  lockdown  coronavirus  GHMC  children  Infants  children deaths  Telanganga  

Other Articles