దేశప్రజలందరూ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో అనునిత్యం సోషల్ మీడియాను అంటిపెట్టుకునే వుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులతో వారు కలవరానికి గురువుతున్నారు. దీంతో అపత్కాల సమయంలో ప్రజలు ఎలాంటి అందోళనకు గురికాకుండా వుండేందుకు తప్పుడు పోస్టులతో పాటు అలాంటి పోస్టులను అప్ లోడ్ చేసిన వ్యక్తులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల మధ్య వర్గవైషమ్యాలను రెచ్చగొట్టేలా.. పోస్టులు పెట్టినవారిపైనా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
తాజాగా, చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయంపై తప్పుడు పోస్టులను ప్రచారం చేసిని తెలంగాణ వాసిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి తప్పుడు పోస్టులు అప్ లోడ్ చేయడంతో పాటు తమ వాట్సాప్ ఖాతాల ద్వారా ఎంతో మందికి పంపడంలో రంగంలోకి దిగిన చిత్తూరు పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటకు వచ్చి మరీ వ్యక్తి అదుపులోకి తీసుకుని చిత్తూరు జిల్లా కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం విష్ణువర్ధన్ రెడ్డి (56) తన ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల ద్వారా, కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్ సెంటర్ గా మార్చారంటూ ప్రచారం చేశాడు.
దీనిపై కాణిపాకం ఆలయం ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈఓ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విష్ణు వర్ధన్ రెడ్డిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి, ఏపీకి తరలించారు. కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా జైలు శిక్షపడుతుందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఓ కాలనీ పేరును చెబుతూ, అక్కడ అన్ని కేసులు వచ్చాయని ప్రచారం చేయడం తప్పని, వైరస్ పాజిటివ్ వచ్చిన వారి చిత్రాలను పోస్ట్ చేస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more