srtback for AP govt on High Court ఆంగ్ల మాధ్యమ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు

Andhra hc sets aside orders to make english medium compulsory in all state run schools

Coronavirus Pandemic, Coronavirus, community spread, lockdown, coronavirus outbreak, coronavirus, covid 19, Education News, Pawan Kalyan, Ap High Court, YS Jaganmohan reddy, English medium Schools, Sudish rambotla, BJP, compulsory English medium, English medium compulsory, English medium, ap english medium school, Andhra Pradesh English medium compulsory, Andhra Pradesh, Politics

In a setback to Jaganmohan Reddy government, Andhra Pradesh High Court on Wednesday set aside its orders to make English medium compulsory in all state-run schools.

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు.. ఆంగ్ల మాధ్యమ ఉత్తర్వులు రద్దు

Posted: 04/15/2020 03:15 PM IST
Andhra hc sets aside orders to make english medium compulsory in all state run schools

ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్రోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81, 85ను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ బీజేపి నాయకుడు సుదీష్‌ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు.

ఈ పిటీషన్లపై విచారణ చసిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది.  ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికే వదిలివేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆంగ్ల  మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఆంగ్లమాధ్యమం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి ఈరోజు వెలువరించింది. జీవోలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles