కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో కరాళ నృత్యం చేస్తోంది. వైట్ హౌజ్ పాలకులకు కంటి మీద కునుకు కరవయ్యేలా చేస్తూ విజృంభిస్తోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిందని ఇది చైనా వైరస్ అని విమర్శలు, అరోపణలు గుప్పించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గేలా చేస్తోంది కరోనా. జన్మస్థలం చైనా అయినా, పెరిగింది ఇటలీ, స్పెయిన్‌లో అన్నట్లుగా కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. అయితే అక్కడి నుంచి అగ్రరాజ్యానికి ఎగబాకిన ఈ వైరస్ అక్కడ అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు చేసుకుంటుంది.
యూఎస్‌లో కరోనా విలయతాండవం చేయబోతోందన్న పరిశోధకుల హెచ్చరికలు వాస్తవరూపం దాలుస్తున్నాయి. తాజాగా చైనా, ఇటలీని దాటుకొని ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. గురువారం నాటికి ఆ దేశంలో 83,545 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 14.9శాతం. వీరిలో 1,201 మందికి పైగా మృత్యువాతపడ్డారు. చైనాలో ఇప్పటి వరకు 81,285 మంది, ఇటలీలో 80,589 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
అయితే, మిగతా దేశాలతో పోలిస్తే కరోనా నిర్ధారణ పరీక్షల్ని అమెరికా భారీ స్థాయిలో పెంచింది. అందువల్లే ప్రతిరోజు పెద్ద ఎత్తున కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. కేవలం ఎనిమిది రోజుల్లో 2,20,000 వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు దేశంలో పరిస్థితుల్ని సమీక్షిస్తున్న శ్వేతసౌధంలో సీనియర్ వైద్యుడు దెబోరా తెలిపారు. అయితే చైనా, ఇటలీతో పోలిస్తే మరణాల సంఖ్య అమెరికాలో తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశం. ఒక్క న్యూయార్క్‌లోనే 38వేల మంది వైరస్ బారిన పడగా.. 281 మంది మరణించారు.
కరోనా వైరస్ వ్యాప్తిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం తెలిపారు. కొన్ని రోజుల క్రితం చైనాపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను ‘చైనీస్ వైరస్’గా అభివర్ణించడంతో పాటు.. కొవిడ్-19 తీవ్రతను ప్రపంచానికి తెలియజేయడంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎంతో ఎవరికీ తెలియదంటూ మరోసారి ఆ దేశంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీరివురి చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more