AP is not alone to postpone local body elections: SEC సీఎస్ కు ఎన్నికల అధికారి మూడు పేజీల లేఖ

Sec writes to cs nilam sawhney says ap is not alone to postpone local body elections

Coronavirus outbreak, Infectious diseases, Coronavirus, covid-19, coronavirus pandemic, State Election Commissioner, N Ramesh Kumar, Chief Secretary, Nilam Sawhney, foreigners quarantine, West Bengal, orissa, Maharashtra. local body elections, local body elections coronavirus, coronavirus cases, coronavirus latest, coronavirus updates, India coronavirus, coronavirus in India

State Election Commissioner N Ramesh Kumar in a three-page letter to Chief Secretary Nilam Sawhney said that Andhra Pradesh is not alone in postponing elections. Maharashtra, Bengal and Orissa also postponed the elections in the wake of Corona outbreak.

సీఎస్ కు ఎన్నికల అధికారి మూడు పేజీల లేఖ

Posted: 03/17/2020 07:28 PM IST
Sec writes to cs nilam sawhney says ap is not alone to postpone local body elections

కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో యదాతథంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ తో ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, రాష్టరోన్నత న్యాయస్థానం హైకోర్టుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్లు వేసింది.

మరోవైపు రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ లేదని... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలను నిర్వహించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఈ లేఖకు రమేశ్ సమాధానం ఇచ్చారు. దానికి బదులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్ మూడు పేజీల పూర్తి స్థాయి వివరణతో లేఖ రాశారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే ఎన్నికలను వాయిదా వేశామని తెలిపారు.

దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని... ఇప్పటికే పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేశారని పేర్కొన్నారు. అదే విధంగా ఏపీలో కూడా వాయిదా వేశామని చెప్పారు. ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావనే ఆరోపణలకు కూడా రమేశ్ వివరణ ఇచ్చారు. ఆర్థికశాఖలో పని చేసిన అనుభవం తనకు ఉందని... ఎన్నికలు ఆలస్యమైనా, ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత కూడా నిధులను తెచ్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి నిధులను తెచ్చుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు.

ఎన్నికల వాయిదాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం కట్టుబడి ఉందని... తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ఉందని... ఇక్కడ ఎన్నికలను నిర్వహిస్తే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఎన్నికలను ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయాన్ని మాత్రం లేఖలో ఆయన పేర్కొనలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles