Man Punches Thief So Hard Enough Breaking A Brick Pillar బాహుబలి: దొంగకిచ్చిన పంచ్ తో గొడ బద్దలు..

Man punches thief hard enough which crashes into a brick pillar and breaks

Viral Video man punch thief, man punch thief brick wall broke, man punch thief brick pillar broke, hard punch man thief, Man punch, car thief, britain police, man puches thief, brick wall pillar, United Kingdom, Britain, Crime

A suspected car thief was punched so hard by a passerby, that his head banged into a brick wall as he tried to run away from the scene. A video of the incident - reportedly from Cypress Road in Droylsden, Greater Manchester - has gone viral on social media.

బ్రిటన్ లో బాహుబలి: దొంగకిచ్చిన పంచ్ తో గొడ బద్దలు..

Posted: 03/17/2020 01:44 PM IST
Man punches thief hard enough which crashes into a brick pillar and breaks

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అతడు సినిమాలో తన అమాయకత్వంతో టీజ్ చేసిన నలుగురు యువకులు తన వెంట పడుతున్నారని, వారికి గట్టిగా మందలించాలని ఊరిలోని విలన్ గ్యాంగ్ కు బుద్ది చెప్పిన హీరో మహేష్ బాబు కు విషయాన్ని చెప్పకుండా ఓ ప్రాంతానికి తీసుకెళ్లి.. పిట్టగోడపై కూర్చున్న నలుగురు యువకులను చూపి వారిని కొట్టమని కోరుతుంది నటి త్రిష. ఆ తరుణంలో వారిద్దరి మధ్య పలు సంబాషణలు జరుగుతాయి. దీంతో ఊరికే ఎలా కొట్టను.. అంటే ఊరికే ఎం వద్దు.. ఒక్కోక్కరికి పది రూపాయల చోప్పున రూ.40 ఇస్తాను అన్న డైలాగ్ వస్తుంది.

దీంతో అసహనంతో రగిలిపోయిన మహేష్ బాబు.. అవేశంగా గొడను కొడితే అది కాస్తా.. బద్దలైపోతుంది. ఇదే సీన్ మెగాస్టర్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ చిత్రంలో ప్రధమార్థం ముగిసే క్రమంలోనూ వుంది. అయితే సినిమాల్లో కాకుండా..  నిజంగా ఓ వ్యక్తి దొంగకిచ్చిన పంచ్ ఎంత గట్టిగా వుందంటే.. ఇక్కడ కూడా ఇటుకలతో నిర్మించిన పిల్లర్ విరిగిపోయింది. చిరంజీవి గ్యాంగ్ లీడర్, మహేష్ అతడు’ చిత్రాల మాదిరిగానే ప్రస్తుతం ఈ వ్యక్తి దొంగకిచ్చిన పంచ్ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్ లోని గ్రేటర్ మాంచెస్టర్ లోని సిప్రెస్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు ముఖానికి తెల్లని మాస్కులు, నల్లరంగు కోటు ధరించి కారును దొంగిలించారు. ఆ కారు యజమాని నుంచి తప్పించుకోనేందుకు కారును వేగంగా నడిపుతు మరో కారును ఢీ కొట్టారు. దాంతో వెంటనే కారు దిగి పరుగులు పెట్టారు. కారు యజమాని మరో కారులో వారిని వెంబడించాడు. ఇంతలో పారిపోతున్న ఇద్దరిలో ఒక వ్యక్తి ఏదో గుర్తుకు వచ్చింది. దీంతో దాని కోసం మళ్లీ వెనక్కి తిరిగి కారువద్దకు చేరుకున్నాడు.

ఇదంతా అటువైపుగా వెళ్తున్న ఓ బాటసారి గమనించి కారులో తాను మర్చిపోయిన వస్తువును తీసుకుని పరిగెడుతున్న దొంగను అటకాయించే ప్రయత్నం చేశాడు. ఆ దొంగ పరిగెతున్నప్పుడు అతనికి అడ్డంగా వెళ్లి పట్టుకుని గట్టిగా ఒక పంచ్ విసిరాడు. ఆ పంచ్ పవర్ ఏంటో కానీ.. దెబ్బకు దొంగ పక్కనే ఉన్నఇటుకుల గోడకు ఉన్న పిల్లర్ కు గుద్దుకుంటాడు. దాంతో పిల్లర్ విరిగి కింద పడిపోయింది. ఈ వీడియోని డీనో60471958 (@Deano60471958) అనే ట్విట్టర్ యూజర్ ‘A bit of British justice’ అనే క్యాప్షన్ తో షేర్ చేస్తాడు. ఆ వీడియోని ఇప్పటివరకు 1.4 మిలియన్లకు పైగా వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh