Baby Gorilla jumps around in hay until mom stops ప్రతీ ఒక్కరికీ బాల్యాన్ని గుర్తుకుతెస్తోన్న గొరిల్లా

Viral video baby gorilla jumps around in hay until mom stops

video viral, viral videos, viral news, funny videos, funny gorilla videos, gorilla comedy videos, Gorilla videos, supriya sahu videos, supriya sahu ias social media, supriya sahu twitter, supriya sahu facebook, animal

Now, the news is that recently IAS officer Supriya Sahu shared a video in which a baby Gorilla playing by jumping into the heap of hay again and again. After a certain time, mother Gorilla came to the spot and took away the baby ape along with her by breaking its game. Now, the video went viral and generating hilarious fun.

ITEMVIDEOS: వైరల్ వీడియో: ప్రతీ ఒక్కరికీ బాల్యాన్ని గుర్తుకుతెస్తోన్న గొరిల్లా

Posted: 03/10/2020 06:57 PM IST
Viral video baby gorilla jumps around in hay until mom stops

చిన్నారులు చేసే అల్లర్లు.. వారు ఆడే ఆటలు చూస్తే మనకు కూడా బాల్యం గుర్తుకువస్తుంది. వారిలో మన బాల్యాన్ని చూసుకోవడం మన గోప్పతనమైతే.. ఆ చిన్నారులు ఎంతో అమాయకంగా అడే ఆటలు మనల్ని విస్మయానికి గురిచేస్తుంటే.. చిన్నారుల తల్లలకు మాత్రం అసలు నచ్చదు. ఎందకంటే చిన్నారు సరదాగా అడినా.. వారికి తెలియక ఎక్కడైనా దెబ్బలు తగిలితే చాలా బాధగా వుంటుందని.. ఆ బాధను చిన్నారుల కన్నా అధికంగా తల్లులే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి చిన్నారులను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటారు.

ఇది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు. జంతు జాతులన్నింటిలోనూ మాతృత్వానిది వెలగట్టలేని ప్రేమ. ఎలా నిలబడాలి, ఎలా నడవాలి.. ఎలా తినాలి. ఇలా అన్నింటినీ నేర్పిస్తారు. ఇక మనుషుల్లో మంచి చెడుల గురించి విశ్లేషించి సక్రమమైన మార్గంలో ఎలా వెళ్లాలో చెబితే.. జంతుజాతుల్లో జన్మతహా వైరం వున్న జాతులు.. అవి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న విషయాలను తల్లులు పిల్ల జంతువులకు తెలుపుతాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ వీడియోలో ఓ చిన్న గొరిల్లా తల్లికి కొంత దూరంగా వెళ్లి అడుకుంటోంది. ఎలా అంటే అక్కడే వున్న ఓ చిన్న గోడపైకి ఎక్కి గడ్డికుప్ప వున్న మధ్యలోకి దూకుతూ.. మళ్లీ లేచి మళ్లీ అలానే పడుతూ.. సంతోషాన్ని పోందుతూ అడుకుంటోంది. అది ఆడుకునే తీరు భలే సరదాగా అనిపించింది. ఈ వీడియోను ఎక్కడిదో తెలియదు కానీ దీనిని ఐఏఏస్ అధికారిని సుప్రియా సాహు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది.

దీన్ని పోస్టు చేస్తూ.. ఈ గొరిల్లాను చూస్తే తనకు తన బాల్యం గుర్తుకు వచ్చిందని.. అమె పేర్కోన్నారు. స్వేచ్చాగా, స్వతంత్రంగా, హాయిగా అడుకుంటుండగా, గొరిల్లా తల్లి వచ్చి దాని పట్టుకెళ్లిందని పోస్టు పెట్టింది. చిన్నప్పుడు తాను తన స్నేహితులతో కలసి అడుకుంటుంటే తన తల్లి తీసుకెళ్లిన విషయాలను తనకు ఈ వీడియో చూస్తే గుర్తుకు వస్తోందని అమె పేర్కోంది. ఇక గడ్డి కుప్పపై దూకుతున్న పిల్ల గొరిల్లాను తల్లి గొరిల్లా వచ్చి దాన్ని చంకనేసుకుని పోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles