coronavirus | a book predicted the outbreak 12 ఏళ్ల ముందే కరోనాపై అప్రమత్తం చేసిన పుస్తకం.!

Coronavirus a book predicted the outbreak 12 years ago

Foreigners, Tourists, Corona Virus, End of Darkness, End of Days, 1981 book, Predictions and prophecies, end of the world Paperback, virus outbreak, coronavirus prediction, End of Days, Sylvia Browne, American psychic, American Author, World Health Organisation (WHO)

A book titled End of Days: Predictions and Prophecies about the End of the World, written by Sylvia Browne, also predicted the global outbreak of coronavirus. The book was first published in 2008.

12ఏళ్ల ముందే కరోనాపై కథనం.. నెట్టింట్లో పుస్తకం సంచలనం.!

Posted: 03/06/2020 04:21 PM IST
Coronavirus a book predicted the outbreak 12 years ago

విదేశీయానం చేసిన తిరిగొచ్చిన మనవారితో, విదేశీ పర్యాటకులతో దేశంలోకి చోచ్చుకొచ్చి.. అప్పుడే 31 మందిని తన కబంధహస్తాల్లోకి తీసుకన్న కరోనా వైరస్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. క్రితం రోజు రాత్రి వరకు 30 మందికి మాత్రమే వున్న బాధితుల సంఖ్య ఢిల్లీలో మరో వ్యక్తి కూడా సోకడంతో 31కి చేరింది. ఈ క్రమంలో ఇటీవల శ్రీమద్విరాట్ పోతులూరి బ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో దశాబ్దాల క్రితమే ఈ కరోనా వైరస్ గురించి చెప్పారన్న వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

తన కాలజ్ఞానంలో ‘‘ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను.. లక్షలాధి  ప్రజలు నచ్చేరయ.. కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి కోడిలాగా తూగి నచ్చేరయా.. శివ గోవింద గోవిందా.. అంటూ స్వామిజీ పేర్కెన్నారు. అయితే కరోనా వ్యాధి గురించే బ్రహ్మంగారు చెప్పారంటూ నెటిజనులు ఆనాటి వ్యాఖ్యలను నెట్టింట హల్ చల్ చేస్తున్న ఈ సందర్భంలోనే 40 ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని మేము చెప్పామంటూ ఓ అమెరికా రచయిత డీన్ కూంట్జ్ పుస్తకాన్ని నెట్టింట్లో హల్ చల్ చేశారు. అయితే దీనిపై అధ్యయనం చేసిన ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్.. ఇందులో నిజమున్నది పాక్షికమేనని అన్నారు.

అయితే డీన్ కూంట్జ్ రాసిని ఎండ్ అప్ డార్క్ నెస్ అనే పుస్తకంలో ఈ కథనమే లేదని పేర్కోన్న రాయిటర్స్.. ఈ పేజీలను 2008లో రాసిన ఎండ్ అప్ డేస్ లోంచి తీసుకున్నదిగా పేర్కోంది. అంతేకాదు.. కరోనా వైరస్ కు సంబంధించిన పేరు వూహన్ 400గా పేర్కోన్నారని, ఇక ఆ వ్యాధి ఆ నగరానికి బయట నుంచి వస్తుందని పుస్తకంలో వుందని, కానీ ఈ వ్యాధికి పుట్టిందే వూహన్ లో అని పేర్కోంది రాయిటర్స్. ఇక ఈ వ్యాధి లక్షణాలు పుస్తకంలో రచయిత పోందుపర్చిన లక్షణాలకు కూడా పూర్తి భిన్నంగా వుందని అన్నారు.

ఇలా రాయిటర్స్ సంస్థకు తెలియకుండానే కరోనా వ్యాధి గురించి ఊహాత్మక అంచనాను ‘ఎండ్ అప్ డేస్’.. ప్రపంచ ముగింపు నేపథ్యంలో ఊహాత్మకలు, ప్రవచనాలు అంటూ సిల్వియా బ్రౌనీ రచించిన పుస్తకంలోని కథనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది రాయిటర్స్ సంస్ధ. దీంతో ఎండ్ ఆఫ్ డేస్ పుస్తకం గురించి.. ఆ పుస్తక రచయిత సిల్వియా బ్రౌనీ గురించి నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. అంతేకాదు.. సిల్వియా బ్రౌనీ ఓ మానసిక నిఫుణురాలనే విషయం కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అమె ఫోటోను కూడా నెటిజనులు షేర్ చేయడంతో ప్రస్తుతం అమె చెందిన అంశాలన్నీ ట్రెండింగ్ గా మారాయి.

ఇంతకీ అమె ఎం చెప్పారంటే.. సుమారు 2020లో న్యూమెనియా వంటి తీవ్రమైన వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సోకుతుందని అమె పేర్కోన్నారు. ఇది ఊపిరితిత్తులు, శ్వాసశాళ గొట్టాలపై దాడి చేస్తోందని తెలిపారు. అంతేకాదు ఈ వ్యాధి నియంత్రణకు తెలిసిన అన్ని చికిత్సలను ప్రయోగించినా నిరోధిస్తుందని.. అయితే ఇది ఎంత త్వరగా వ్యాప్తి చెందుతుందో.. అంతే త్వరగా కనిపించకుండా పోతుందని, మళ్లీ పదేళ్ల నాటికి తిరిగి వస్తుందని, ఆ తరువాత పూర్తిగా కనుమరుగైపోతుందని అమె తన ఊహాత్మక అంచనాలను వెలువరించారు.

అయితే అమె చెప్పిన ఊహాలన్నీ నిజంగానే నిజం కావడంతో.. కరోనా వైరస్ సోకినవారిలో వైరస్ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం గమార్హం. దీంతో పాటు తెలిసిన అన్ని చికిత్సా మార్గాలకు కూడా ఈ వైరస్ లొంగకుండా.. వ్యాప్తి చెందడం కూడా రచయిత్రి అంచనా వేసినట్లుగానే వుందని నెట్ జనులు అమె రాసిన పుస్తకం కవర్ పేజీలో పాటు అమె ఈ వైరస్ గురించి చెప్పిన సారాంశాన్ని ఎర్రగా మార్క్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇక మరికోందరు అమె పుస్తకంతో పాటు అమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇలా ఆమెకు చెందిన ప్రతీ టాపిక్ ఇప్పడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే అమె సారంశాన్ని చదవి అర్థం చేసుకున్న వాళ్లు మాత్రం.. కొంత ధైర్యంగా వుండేలా పోస్టు పెడుతున్నారు. కరోనా వ్యాధి గురించి భయపడింది చాలు.. ఇక కొంత కాలం ఒపిక పట్టండంటూ నెట్ జనులు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. కరోనా వైరస్ అనగానే ప్రపంచవ్యాప్తంగా భయపడిన జనం.. సిల్వియా బ్రౌనీ రాసిన కథనం ప్రాచుర్యంలోకి రావడంతో ఇక త్వరగానే ఈ వైరస్ కనుమరుగు అవుతుంది అంటూ ఒకరికోకరు ధైర్యం చెబుతున్నారు. ఇక భయపడకండీ త్వరలోనే ఈ వైరస్ కనుమరుగు అవుతుంది అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles