govt orders schools to grant leave to students జలుబు, జ్వరం ఉంటే సెలవు తీస్కొమన్న తెలంగాణ విద్యాశాఖ

Coronavirus students suffering from cold and fever can take leave telangana govt

Coronavirus, Coronavirus news, schools, cold, dry cough, secundrabad, corona spread, students, Telangana Education department, Coronavirus new case, Coronavirus cases, Coronavirus Hyderabad, Coronavirus secundrabad, coronavirus, latest, Coronavirus in Raheja Mindspace, Coronavirus latest updates, Coronavirus Case in Raheja Mindspace, Hyderabad, remedy for Coronavirus, covid-19, Telangana, Health

In the wake of coronavirus, which seems to be fast spreading across the country, to eradicate the spread in the students the government has taken all necessary measures. Telangana Education department has issued orders to school to grant leave to the students who suffers from cold, cough and fever.

జలుబు, జ్వరం ఉంటే సెలవు తీస్కొమన్న తెలంగాణ విద్యాశాఖ

Posted: 03/06/2020 11:32 AM IST
Coronavirus students suffering from cold and fever can take leave telangana govt

యావత్ ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ నగరంలో కూడా జడలు విప్పుతోందా.? వాస్తవానికి వాతావరణంలో ఉష్ణ స్థితి అధికంగా వుండే భారతదేశంలో అందులోనూ డెక్కన్ ప్ల్యాటూగా ఏర్పడిన దక్షిణ ప్రాంతంలోనూ ఈ వ్యాధి వ్యాప్తి. దాని ప్రభావం అంతగా వుండదని ఇప్పటికే పలువిధాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే రోగ నిరోధక శక్తి అధికంగా లేని చిన్నారులు, డెబ్బై ఏళ్లు నిండిన పెద్దల విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా వైద్యులు చెబుతున్నారు.

వీరితో పాటు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఈ వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచనలుఇస్తున్నారు. ఈ క్రమంలో బిపి పేషంట్లు, హృద్రోగులు, డయాబెటిస్ గ్రస్తులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలన్న సూచనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ నుంచి బెంగళూరు, అక్కడి నుంచి సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్ లోని తన స్వగృహానికి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరుకు ఈ వ్యాధి సోకడంతో, అతడికి గాంధీ అసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు.

ఈ సూచనల నేపథ్యంలోతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటే, వారు సెలవు తీసుకోవచ్చునని పేర్కోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ సీహెచ్ రమణ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా వుండటం.. వారు తమ సమస్యను ప్రారంభంలోనే చెప్పలేకపోవడంతో.. వ్యాధి విద్యార్థులందరికీ ప్రబలే అవకాశాలు అధికంగా వుంటాయని భావించిన విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యాలయం, జిల్లాల పరిధిలో డీఈఓలు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థులు జాగ్రత్త చర్యలు పాటించడంలోనూ పెద్దగా శ్రద్ద చూపనందున వారిని వారి తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వుంచడం సముచితమని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థులైనా, టీచర్లకు అయినా జలుబు, జ్వరం, శ్వాస సంబంధింత సమస్యలుంటే, మూడు రోజులు బడికి రావద్దని, లక్షణాలు తగ్గేంత వరకూ చికిత్స తీసుకోవాలని విద్యా శాఖ కోరింది. ప్రతి సోమవారం పాఠశాల అసెంబ్లీలో వైరస్ పై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని అదేశించింది.

ఇక దీంతోపాటు స్కూలు జరుగుతున్న సమయంలో కనీసం నాలుగు సార్లు చేతులను కడుక్కునేందుకు అవసరమైన లిక్విడ్స్ అందుబాటులో ఉంచాలన్న విద్యాశాఖ ఈ అదేశాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు తప్పక పాటించాలని పేర్కొంది. ఇదే విషయాన్ని నోటీసు బోర్డుల్లో డిస్ ప్లే చేయాలని, స్కూలు తలుపులను సబ్బు నీటితో శుభ్రం చేయించాలని ఆదేశించింది. విద్యార్థులు తరచూ చేతులు కడుక్కుంటూ ఉండేలా చూడాలని సూచించింది. ఎవరైనా కరోనా బాధిత దేశాల నుంచి వచ్చిన వారి పిల్లలు స్కూల్ లో చదువుతుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh