"Courts Watching Tamasha": Nirbhaya's Mother ‘నిర్భయ’ కేసు: మరణిశిక్షపై స్టే.. ఆశాదేవి భావోద్వేగం

Nirbhaya case court stays execution of convicts mother say entire system supports criminals

Nirbhaya convicts, Execution, Pawan Gupta, Curative petition, Supreme court, Patiyala Court, Death Sentence, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts Curative petition, Satish Kumar Arora, Supreme Court, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, gang-rape, Tihar jail, Crime

Asha Devi, mother of the 23-year-old medical student whose fatal gang-rape in 2012 on a moving bus in Delhi, said that the repeated delay in the execution of the convicts shows the "ineffectiveness" of India's legal system.

‘నిర్భయ’ కేసు: మరణిశిక్షపై స్టే.. ఆశాదేవి భావోద్వేగం

Posted: 03/02/2020 08:25 PM IST
Nirbhaya case court stays execution of convicts mother say entire system supports criminals

పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దేశప్రజలు అందరూ భావిస్తున్నట్లే.. దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఈ కేసులో దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా వేసిన క్యురేటివ్‌ పిటిషన్ ను ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అంతా ఉరి శిక్ష అమలు జరుగుతుందనే భావనలో వున్న తరుణంలో.. ఒక్కసారిగా చేధువార్త వ్యాప్తితో ప్రజలు నిట్టూర్చుతున్నారు. నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది.

తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీలపై కోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటీషన్ ను న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో.. ఆ వెంటనే పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఈ మెర్సీ పిటిషన్ వేశారు.

దీంతో రాష్ట్రపతి ముందు దోషులలో ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ దోషులను ఉరితీయరాదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు తాజా ఆదేశాలతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీలలో జారీచేసిన డెత్ వారెంట్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా మూడోసారి మార్చి 3న విధించాల్సిన మరణశిక్ష కూడా వాయిదా పడింది.

ఢిల్లీ కోర్టు మరోసారి స్టే విధించడంపై నిర్భయ తల్లి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పదే పదే వాయిదా పడడం మన ‘‘వ్యవస్థ వైఫల్య’’మంటూ ఆమె కంటతడి పెట్టారు. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు ఆవరణంలోనే కూలబడిన ఆమె కొద్ది సేపు వెక్కివెక్కి ఏడ్చారు. నలుగురు నిందితుల్లో ఒకడైన పవన్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి ముందు పెండింగ్లో ఉన్నందున తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఉరిశిక్ష నిలిపివేయాలని ఢిల్లీకోర్టు ఆదేశించింది.

దీంతో..‘‘దోషులను ఉరితీయాలంటూ ఇచ్చిన సొంత ఆదేశాలను అమలు చేయడానికి కోర్టు ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నట్టు? ఉరిశిక్షను పదేపదే వాయిదా వేయడం మన వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది. మన వ్యవస్థ మొత్తం నిందితులకే మద్దతు ఇస్తుంది. ఈ కేసులో కోర్టు ఏమి చేస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది....’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles