Life Threat from CM KCR and Rajeshwar Rao: MP Revanth Reddy సీఎం కేసీఆర్, రాజేశ్వర్ రావుల నుంచి ప్రాణహానీ: రేవంత్ రెడ్డి

Congress mp revanth reddy alleges life threat from cm kcr and rajeshwar rao

Revanth Reddy, Malkajgiri MP, Congress, CM KCR, My Home Rajeshwar Rao, KTR, Life Threat, Patnam Gosa, Kukatpally, Hyderabad, Telangana, Politics

Congress Senior Leader and Malkajgiri member of parliament Revanth Reddy alleges he has Life Threat from CM KCR and My Home Rajeshwar Rao. He approches High Court to direct Government to give him security of 4 plus 4 gunmen.

సీఎం కేసీఆర్, రాజేశ్వర్ రావుల నుంచి ప్రాణహానీ: రేవంత్ రెడ్డి

Posted: 02/29/2020 11:23 AM IST
Congress mp revanth reddy alleges life threat from cm kcr and rajeshwar rao

ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తనకు ప్రభుత్వ పెద్దల నుంచి ప్రాణహాని పొంచి వుందన్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం లేదంటే, స్వతంత్ర ఏజెన్సీల నుంచి 4 ప్లస్ 4 గన్ మెన్లతో ఎస్కార్ట్ కల్పించాలని ఆదేశించాల్సిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

గతంలో తనకున్న 3 ప్లస్ 3 గన్‌మెన్లతో రక్షణ ఉండేదని, ఆ తర్వాత దాన్ని 2 ప్లస్ 2కు తగ్గించినట్టు కోర్టుకు తెలిపారు. తన ప్రాణాలకు హాని ఉండడంతో భద్రత పెంచాలని కోరుతూ 28 ఆగస్టు 2019న కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, జూపల్లి రామేశ్వరరావులను రేవంత్‌రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు.

మరోవైపు సీఎం కేసీఆర్ హైదరాబాదులో సలీమ్ అనే వృద్ధుడ్ని కలిసి అతడి కష్టాలు తీర్చారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన రేవంత్ రెడ్డి, అదంతా ఓ నాటకమని కొట్టిపారేశారు. కొడుకు కేటీఆర్ ఊర్లు తిరుగుంటే సీఎం కేసీఆర్ హైదరాబాదులో తిరుగుతూ సురభి నాటకాలను మించిపోయేలా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ నేతలు సంపన్నులయ్యారని, పేదలకు మాత్రం ఇళ్లు లభించలేదని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ ఆర్భాటాలకు పోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Malkajgiri MP  Congress  CM KCR  Rajeshwar Rao  KTR  Life Threat  Patnam Gosa  Kukatpally  Telangana  Politics  

Other Articles