Gunman Kills 5 Co-Workers at Molson Coors in Milwaukee అమెరికా బీర్ల కంపెనీలో కాల్పుల కలకలం.. 5గురు మృతి

Milwaukee shooting five dead at molson coors campus after employee opens fire

Gun firing, Gun shooting, milwaukee shooting, molson coors beer company, beer company firing, beer company shooting, Michigan's western shore, milwwaukee Violence, wisconsin, politics nation, Milwaukee, Wisconsin, US news, Crime

An employee opened fire at the Milwaukee campus of Molson Coors killing five fellow workers before taking his own life. Police identified the man responsible for the shooting at one of the world’s largest brewers of beer as a 51-year-old Milwaukee man who died of a self-inflicted gunshot wound.

అమెరికా బీర్ల కంపెనీలో కాల్పుల కలకలం.. 5గురు మృతి

Posted: 02/27/2020 11:27 AM IST
Milwaukee shooting five dead at molson coors campus after employee opens fire

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. ఓ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించిన పరిశ్రమలోని తన సహుద్యోగులపై కాల్పులకు తెగబడ్డాడు. బీర్ పరిశ్రమలకు నెలవైన ప్రాంతంగా పేరొందిన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్‌వాకీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన ఉద్యోగం పోయిందన్న మానసిక అవేదనకు గురైన వ్యక్తి దానినీ జీర్ణించుకోలేక తుపాకితో కంపెనీలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

పోలీసులు కథనం ప్రకారం.. ప్రముఖ మోల్సన్ కూర్స్ బీర్ల కంపెనీలో విధులు నిర్వహించిన ఓ ఉద్యోగిని సంస్థ యాజమాన్యం కొంతకాలం క్రితం విధుల నుంచి తొలగిచింది. దీంతో మానసిక అవేదనకు గురైన సదరు ఉద్యోగి ఉన్మాదిలా మారి.. కోపంతో రగిలిపోతూ ప్రతీకారేచ్చ కోసం వేచిచూశాడు. ఈ క్రమంలో సంస్థలో పనిచేస్తున్న మరో ఉద్యోగి ఐడీకార్డు దొంగిలించి సంస్థలోకి చోరబడిన నిందితుడు.. తన వెంట తెచ్చుకున్న తుపాకితో తన సహచర ఉద్యోగులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.

తనను ఉద్యోగంలోంచి తొలగించేందుకు కారణమైన వ్యక్తులపై ప్రతీకారేచ్చతో చంపాలని కంపెనీలోకి వచ్చిన నిందితుడు.. వారు కనిపించకపోవడంతో సంస్థలో విధులు నిర్వహిస్తున్న సహచర ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. నిందితుడి కాల్పుల్లో ఐదుగరు ఉద్యోగులు మరణించారు. ఈ ఘటనతో మరింతగా మానసికంగా దిగజారిన నిందితుడు తనను తాను కాల్చుకున్నాడు. కాల్పుల శబ్దం వినగానే ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతోందో తెలియక అయోమయానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : molson coors  beer company  beer company firing  beer company shooting  Milwaukee  Wisconsin  US news  Crime  

Other Articles