Couple thrash student on road in Hyderabad ‘‘లేబర్ నా కొడుకులు, చిల్లరగాళ్లు’’.. దంపతులపై పోస్కో కేసు..

Couple thrash student on road in hyderabad

Govt school student, couple, thrashed, playing, shouting, round table school, sanath nagar, black and blue, CCTV footage, sanath nagar police, Crime

A woman brutally thrashed a student of Round Table government school alleging that he was carelessly playing on the road. A few minutes later, her husband also joined hands and thrashed the student black and blue.

ITEMVIDEOS: ‘‘లేబర్ నా కొడుకులు, చిల్లరగాళ్లు’’.. దంపతులపై పోస్కో కేసు..

Posted: 02/19/2020 02:45 PM IST
Couple thrash student on road in hyderabad

హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చావచితక బాదిన ఓ మహిళ.. తన భర్తతో కలసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పిర్యాదు చేసింది. రోడ్డు కూడలి వద్ద నిలబడ్డ బాలుడు ఏదో చెప్పబోతున్నా.. వినిపించుకోకుండా.. బాలుడన్న కనీస విచక్షణ కూడా లేకుండా వస్తూనే చాచికొట్టింది. తానేం చేయలేదని ఆ బాలుడు రోదిస్తూ చెప్పినా.. వినిపించుకోలేదు.. చివరాఖరుకు బాలుడు తనను వదిలిపెట్టాలని కాళ్లు మొక్కినా..  లేబర్ నా కొడుకులు, చిల్లరగాళ్లు అంటూ పెద్ద బాగోతమే చేసింది.

ఈ అమానుష ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది. స్థానికంగా వున్న రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆడుకుంటూన్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఓ మహిళ పరుగు పరుగున వచ్చి కూడలిలో నిల్చున్న బాలుడ్ని చాచిపెట్టి కొట్టింది. ఆ తరువాత ఆ బాలుడ్ని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లంది. ఇంతలో అమె భర్త కూడా వచ్చి బాలుడ్ని కోట్టాడు. అసలేం జరిగింది.. ఎందుకు వారు బాలుడ్ని కొడుతున్నారు అన్న విషయం తెలియకున్నా.. కనీసం చిన్నారిని కర్కశంగా కొట్టకుండా గుమ్మిగూడిన జనం ఆపిన పాపన పోలేదు.

తానేం చెశానో కూడా తెలియకపోయినా.. దెబ్బలు తిన్న బాధిత బాలుడు.. తనను వదిలిపెట్టాలని కోరుతూ మహిళ కాళ్లు మొక్కినా.. అమె కనీస కనికరం కూడా చూపలేదు. పైగా లేబర్ నా కొడుకులు, చిల్లరగాళ్లు అంటూ పెద్ద సీన్ చేసింది. ఇక ఆతర్వాత.. రోడ్డుపై బాహాటంగా అందరూ చూస్తుండగా తాను బాలుడ్ని కొట్టానని.. ఈ దృశ్యాలు నెట్ లో ప్రత్యక్ష అవుతాయని భావించిన దంపతులు ముందస్తు జాగ్రత్తగా వెళ్లి బాలుడిపై పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అదే పోలిస్ స్టేషన్ కు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు దంపతులపై పిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ దృశ్యాలను చూడటంతో వారికి అసలు విషయమేంటో అర్ధమైంది. విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా ఫిర్యాదు చేసిన దంపతులపై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు పెట్టి, వారిని అదుపులోకి తీసుకున్నారు. దంపతుల చేతిలో దెబ్బలు తిన్న బాలుడ్ని అతడి తల్లిదండ్రులు అసుపత్రిలో చికిత్స చేయించారు. మహిళ తనపై విరుచుకుపడి దాడి చేసిన విధానానికి భయకంపితుడైన బాలుడ జర్వంతో బాధపడుతున్నాడని అతడి కుటుంబసభ్యలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles