family tries to kill woman to save dowry కట్నం ఇవ్వాలని.. కన్నవారే కడతేర్చాలనుకున్నారా.?

Parents brother tries to kill woman in telangana to save dowry

Kavitha, Lakshmamma, Godavardhan, Father, brother, Mother, Dowry, sketch to kill, MSc Kavitha, MSC chemistry, JOB, Velagalagudem village, Munugodu Mandal, Nalgonda, Telangana, Crime

In a heinous crime, parents and a brother tried hard to kill a woman in Telangana. According to the sources, the victim identified as Kavitha of Velagalagudem village, Munugodu Mandal, Nalgonda, lodged a complaint at the police station that her parents and his brother harassing her over not doing marriage to her over the fear of losing money.

ITEMVIDEOS: పేగుబంధమే పగబట్టిందా.? కన్నవారే కడతేర్చాలనుకున్నారా.?

Posted: 02/07/2020 03:27 PM IST
Parents brother tries to kill woman in telangana to save dowry

పాము తన గుడ్డును తానే తిన్నట్లు.. కన్నపాశం తోడబుట్టిన పేగుబంధం తన పాలిట శాపమై.. తనను హతమార్చేందుకు యత్నించాయి. ఈ మేరకు ఓ బాధితురాలు తన కన్నవారిపై, తొడబుట్టిన సోదరుడిపై పిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో అమ్మాయి ఎదుగుతుందని భావిస్తే చాలు.. కన్నవారు అమెకు ఎప్పుడు పెళ్లి చేద్దామా.? అంటూ అమె వెంటబడతారు. అమెకు ఇష్టంలేకపోయినా.. నచ్చజెప్పి.. సంబంధాలు చూస్తుంటారు. పనిలోపనిగా డబ్బును కూడా అన్ని మార్గాల ద్వారా సమకూర్చుకుంటారు.

కానీ ఇక్కడ ఓ కుటుంబం మాత్రం తమ బిడ్డకు పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాల్సి వస్తుందని.. అది ఇష్టం లేక అమెను ఏకంగా హతమార్చేందుకు ప్రయత్నించారు. ఏడాది కాలంగా అమెను వేదిస్తున్న కన్నవారు.. అమెకు పెళ్లి చేయడానికి నిరాకరిస్తున్నారు. అలాగని ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదవిని అమెను తన మానాన తాను ఏదో ఒక పని చేసుకుంటానని చెప్పినా అందుకు కూడా అంగీకరించడం లేదు. ఇంట్లోనే అమెను నాలుగు గోడల మధ్యే ఉండాలని ఆంక్షలు పెడుతూ.. ఇంటి పనులను చేయించుకుంటున్నారు.

అయితే గత అర్థారాత్రి రెండు గంటల సమయంలో అమెను తమ ఇంటి బయటకు తీసుకెళ్లి అమె తలపై బండరాయితో మోడి హతమార్చాలని యత్నించారు. భాధను భరించలేక యువతి పెట్టిన అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి అమెను రక్షించారు. ఇరుగుపోరుగువారు రావడంతో బాధితురాలి తల్లి లక్ష్మమ్మ, సోదరుడు గోవర్థన్ ఇద్దరు పరారయ్యారు. కాగా బాధితురాలి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నల్గోండ జిల్లా మునుగోడు మండలపరిధిలోని వెలగళగూడెం గ్రామంలో జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kavitha  Father  brother  Mother  Dowry  sketch to kill  JOB  Velagalagudem village  Munugodu Mandal  Nalgonda  Telangana  Crime  

Other Articles