Nara Lokesh files defamation case against Sakshi paper ‘చిరుతిండి’పై దండయాత్ర.. సాక్షిపై నారా లోకేష్ పరువునష్టం దావా

Nara lokesh files defamation case against sakshi paper

Nara Lokesh, defamation case, Telugu daily Sakshi, false article, article on food, Sakshi paper, nara lokesh article on food, YS Jagan, CM YS Jagan, YSRCP, Visakhapatnam additional district court, Andhra Pradesh, Politics

Telugu Desam Party leader, former minister Nara Lokesh filed a defamation case on Telugu daily Sakshi. According to the sources, Lokesh expressed angry over an article published on Sakshi paper on 20 October 2019 against the expenditure of Lokesh on his food and filed a defamation case in Visakhapatnam additional district court

‘చిరుతిండి’పై దండయాత్ర.. సాక్షిపై నారా లోకేష్ పరువునష్టం దావా

Posted: 01/25/2020 04:19 PM IST
Nara lokesh files defamation case against sakshi paper

రాష్ట్ర ముఖ్యమంతి, అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికపై టీడీపీ యుద్దం ప్రకటించింది. గతంతో టీడీపీ నేతలపై రాసిన కథనాలపై ఇప్పుడు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఏకంగా ఆ పార్టీ యువనేత, మాజీ మంత్రి, అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ తొలుత సాక్షి దినపత్రికపై పోరుకు సిద్దమయ్యారు. ఏకంగా సాక్షి దినపత్రికపై రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేశారు. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ ఉదయం ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

'చినబాబు చిరుతిండి 25 లక్షలండి' శీర్షకన గత ఏడాది అక్టోబర్ 22న సాక్షిలో ఓ కథనాన్ని ప్రచురించడంతో దానిపై ఇప్పుడు ఆయన స్పందించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్... సాక్షిపై పరువునష్టం దావా వేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని సాక్షి దినపత్రిక ప్రచురించిందని తన వ్యాజ్యంలో లోకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒరిజినల్ సూట్ 6/2020 నెంబరుతో వ్యాజ్యం దాఖలైంది. అయితే ఈ కథనాన్ని కూడా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అధికార పక్షం కావాలని రాయించిందని టీడీపీ నేతలు అరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles